Song » Eavarivo naevevarivo / ఎవరివో నీవెవరివో
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
T.Chalapathi Rao / టి.చలపతి రావు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
saakee : O... sajeeva Silpa suMdaree naa jeevanaraaga maMjaree... pallavi : evarivO neevevarivO... (2) evarivO... naa bhaavanalO naa saadhanalO (2) naaTyamu chaesae raaNivO evarivO neevevarivO... charaNaM : 1 divinae vadali bhuvikaeteMchina taenela ve nnela sOnavO IIdivinaeII kavitaavaeSamu kalalai alalai kurisina poovula vaanavO IIevarivOII charaNaM : 2 nava vasaMtamuna naMdanavanamuna (2) kOyila paaDina paaTavO IInavaII valapu kolanulO kalakala virisina kaluvala kannula kaaMtivO IIevarivOII charaNaM : 3 neekara kaMkaNa nikvaNamaa adi vaaNee veeNaa ninaadamaa nee pada noopura nisvanamaa adi jaladhi taraMga mRdaMga naadamaa raavae mOhana roopamaa raavae nootana taejamaa raavae... raavae...
సాకీ : ఓ... సజీవ శిల్ప సుందరీ నా జీవనరాగ మంజరీ... పల్లవి : ఎవరివో నీవెవరివో... (2) ఎవరివో... నా భావనలో నా సాధనలో (2) నాట్యము చేసే రాణివో ఎవరివో నీవెవరివో... చరణం : 1 దివినే వదలి భువికేతెంచిన తేనెల వె న్నెల సోనవో ॥దివినే॥ కవితావేశము కలలై అలలై కురిసిన పూవుల వానవో ॥ఎవరివో॥ చరణం : 2 నవ వసంతమున నందనవనమున (2) కోయిల పాడిన పాటవో ॥నవ॥ వలపు కొలనులో కలకల విరిసిన కలువల కన్నుల కాంతివో ॥ఎవరివో॥ చరణం : 3 నీకర కంకణ నిక్వణమా అది వాణీ వీణా నినాదమా నీ పద నూపుర నిస్వనమా అది జలధి తరంగ మృదంగ నాదమా రావే మోహన రూపమా రావే నూతన తేజమా రావే... రావే...
0 comments:
Post a Comment