Song » Janma needaelae / జన్మ నీదేలే
Song Details:Actor :
Bharath / భరత్ ,Actress :
Sandhya / సంధ్య ,Music Director :
Joshua Sridhar / జోష్వా శ్రీధర్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Haricharan / హరిచరణ్ ,Song Category : Others
pallavi : janma needaelae marujanma neekaelae jatanu viDichaavO chitikipOtaanae priyatamaa... praNayamaa... kumalakae... praaNamaa... aDugu neetOnae... IIjanmaII charaNaM : 1 kannula baadhanu kannula neerae telupunu valachina hRdayamu telupadulae gaDDilO pichchiga poosina poovulae ennaDu daevata poojaku nOchavulae merupullO teegala meeda mainaa kaDutuMdaa gooDu mana praemaku OTami raanaeraadu prati nadikee malupulu tadhyaM bratukullO baadhalu nityaM eda gaayaM maanpunu kaalaM sirivennela maatraM nammi chiguraakulu bratukavu kaadaa miNugurulae oDi kiraNaM charaNaM : 2 tallini taMDrini kaadani praemae kOrina chilukaku gooDugaa nae unnaa guMDepai neevuga vaalina praemalO eduruga piDugulae paDinanu viDuvanulae snaanaaniki vaeNNeelautaa avikaachae maMTanautaa hRdayaMlO ninnae nilipaalae niduriMchae kaMTlO naenae paapalle maelukuMTaa kalalOnae gastee kaastaalae naenaMToo naenae kaadu nuvulaeka naenaelaenu nee kaMTi reppallae uMTaa IIjanmaII
పల్లవి : జన్మ నీదేలే మరుజన్మ నీకేలే జతను విడిచావో చితికిపోతానే ప్రియతమా... ప్రణయమా... కుమలకే... ప్రాణమా... అడుగు నీతోనే... ॥జన్మ॥ చరణం : 1 కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును వలచిన హృదయము తెలుపదులే గడ్డిలో పిచ్చిగ పూసిన పూవులే ఎన్నడు దేవత పూజకు నోచవులే మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు మన ప్రేమకు ఓటమి రానేరాదు ప్రతి నదికీ మలుపులు తధ్యం బ్రతుకుల్లో బాధలు నిత్యం ఎద గాయం మాన్పును కాలం సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కాదా మిణుగురులే ఒడి కిరణం చరణం : 2 తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు గూడుగా నే ఉన్నా గుండెపై నీవుగ వాలిన ప్రేమలో ఎదురుగ పిడుగులే పడినను విడువనులే స్నానానికి వేణ్ణీలౌతా అవికాచే మంటనౌతా హృదయంలో నిన్నే నిలిపాలే నిదురించే కంట్లో నేనే పాపల్లె మేలుకుంటా కలలోనే గస్తీ కాస్తాలే నేనంటూ నేనే కాదు నువులేక నేనేలేను నీ కంటి రెప్పల్లే ఉంటా ॥జన్మ॥
0 comments:
Post a Comment