Sunday, July 12, 2020

Premikudu » O cheliyaa      ప్రేమికుడు » ఓ చెలియా

July 12, 2020 Posted by Publisher , No comments

Song » O cheliyaa / ఓ చెలియా

Song Details:Actor : Prabhu Deva / ప్రభు దేవా ,Actress : Nagma / నగ్మా ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Love & Romantic Songs
O celiyA nA priyasaKiyA ceyi jArenu nA manasE

E cOTa adi jArinadO A jADE maracitinE

prEmaMTe enni agacATlO mana kalayika telipinadE

nA guMDelalO prEma paravaSamai iru kannulu sOlenulE

I pUTa celi nA mATa ika karuvai pOyenulE

adharamu udaramu naDumu EdO alajaDi rEgenulE

vIkShaNalO nirIkShaNalO marukShaNamoka yugamElE

cUpulanni veMTADinaTTu madi kalavara mAyenulE

idi svargamA narakamA EviTi teliyadulE

I jIviki jIvamu maraNamu nI cEtilO unnadilE

kOkilamma nuvu saiyyaMTE nE pADenu sarugamalE

gOpuramA ninu cErukoni savariMcEnu nI kurulE

vennelammA nIku jOlapADi kAli meTikalu viricEnE

vIcETi cali gAlulaku teracApai nilicEnE

nA ASala UsulE cevilOna cebutAnE

nI aDugula ceragani gurutulE prEma caritalu aMTAnE           ||O celi||
ఓ చెలియా నా ప్రియసఖియా చెయి జారెను నా మనసే

ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే

ప్రేమంటె ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే

నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే

ఈ పూట చెలి నా మాట ఇక కరువై పోయెనులే

అధరము ఉదరము నడుము ఏదో అలజడి రేగెనులే

వీక్షణలో నిరీక్షణలో మరుక్షణమొక యుగమేలే

చూపులన్ని వెంటాడినట్టు మది కలవర మాయెనులే

ఇది స్వర్గమా నరకమా ఏవిటి తెలియదులే

ఈ జీవికి జీవము మరణము నీ చేతిలో ఉన్నదిలే

కోకిలమ్మ నువు సైయ్యంటే నే పాడెను సరుగమలే

గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే

వెన్నెలమ్మా నీకు జోలపాడి కాలి మెటికలు విరిచేనే

వీచేటి చలి గాలులకు తెరచాపై నిలిచేనే

నా ఆశల ఊసులే చెవిలోన చెబుతానే

నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే           ||ఓ చెలి||

0 comments:

Post a Comment