Sunday, July 19, 2020

Pournami » Evaro chudaali      పౌర్ణమి » ఎవరో చూడాలి

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Evaro chudaali / ఎవరో చూడాలి
Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Charmi / చార్మి ,  Trisha / త్రిష  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Others
pallavi:

evarO cUDAli ani nATyamaDadE nemali

eTugA sAgAli ani Eru evarini aDagAli

kU aMTU kaburupeDitE ragilE koMDagAli

U aMTU tarigi rAdA niMgE poMgi porali  evarO
caraNaM:

tanalO cinukE baruvai karimabbE vadilinA

ceralO kunukE karavai kalavaramE tariminA

vanamEnannu tana oDilO ammai poduvukunnadani

pasipApalle kommalO uyyAla Uputunnadani

nemmadigA nAmadikE nammakamaMdiMcE devarO - evarO evarO
caraNaM:

varasE kalipE canuvai nanu taDimi pUlatO

kanulE tuDicE celimai tala nimirE jAlitO

epuDO kanna tIpikala edurautuMTE dIpikalA

SilalO unna SilpakaLa naDakE nErcukuMdi ilA

duMduDukO muMdaDugO saMgati aDigEvaru evarO
పల్లవి:

ఎవరో చూడాలి అని నాట్యమడదే నెమలి

ఎటుగా సాగాలి అని ఏరు ఎవరిని అడగాలి

కూ అంటూ కబురుపెడితే రగిలే కొండగాలి

ఊ అంటూ తరిగి రాదా నింగే పొంగి పొరలి  ఎవరో
చరణం:

తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా

చెరలో కునుకే కరవై కలవరమే తరిమినా

వనమేనన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని

పసిపాపల్లె కొమ్మలో ఉయ్యాల ఊపుతున్నదని

నెమ్మదిగా నామదికే నమ్మకమందించే దెవరో - ఎవరో ఎవరో
చరణం:

వరసే కలిపే చనువై నను తడిమి పూలతో

కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో

ఎపుడో కన్న తీపికల ఎదురౌతుంటే దీపికలా

శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకుంది ఇలా

దుందుడుకో ముందడుగో సంగతి అడిగేవరు ఎవరో

0 comments:

Post a Comment