Sunday, July 19, 2020

Pelli Sandadi (Srikanth) » Hrudayamane      పెళ్ళి సందడి (శ్రీకాంత్) » హృదయమనే

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Hrudayamane / హృదయమనే

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Ravali / రవళి ,  Deepti Bhatnagar / దీప్తి భట్నాగర్ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
haa.. hRudayamanE kOvela talupulu tericE taaLaM
prEma prEma prEma
aa..tyaagamanE dEvata sannidhi veligE dIpaM
prEma prEma prEma
aNuvaNuvunu celimiki aMkitamiccunu prEma
tanu niluvunaa karugutU kaaMti paMcunadi prEma
gaganaaniki nElaku vaMtena vEsina vaanavillu I prEma
prEma prEma prEma
haa.. hRudayamanE kOvela talupulu tericE taaLaM
prEma prEma prEma



ivvaDamE nErpagala I prEma
tanakoraku E sirini aDagadu kadaa
navvaDamE cUpagala I prEma
maMTalanE vennelagaa maarcunu kadaa
gaaliki gaMdhamu pUyaDamE pUlaku telisina prEmasudha
raalina puvvula j~jaapakamE kaalaM cadivE prEmakatha
priyamaina tanavaari suKashaaMtulE kOri
murisETi guNamE prEma
prEma prEma prEma



haa.. hRudayamanE kOvela talupulu tericE taaLaM
prEma prEma prEma



E jatanO eMdukO viDadIsi 
veMTaaDu vETaaDu aaTE prEma
maunamutO manasunE shRuticEsi 
raagaalu palikiMcu paaTE prEma
shaashwata caritala I prEma mRutyuvu erugani cirunaamaa
shwaasanu maMgaLahaaratigaa veligiMcEdE I prEma
maraNaanni ediriMci 
maraNaanni ediriMci  marujanmagaa vacci
maraNaanni ediriMci  marujanmagaa vacci
karuNiMcu varamE prEma
prEma prEma prEma



haa.. hRudayamanE kOvela talupulu tericE taaLaM
prEma prEma prEma
aa..tyaagamanE dEvata sannidhi veligE dIpaM
prEma prEma prEma
హా.. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ..త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ
అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ
తను నిలువునా కరుగుతూ కాంతి పంచునది ప్రేమ
గగనానికి నేలకు వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ
హా.. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ




ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ
తనకొరకు ఏ సిరిని అడగదు కదా
నవ్వడమే చూపగల ఈ ప్రేమ
మంటలనే వెన్నెలగా మార్చును కదా
గాలికి గంధము పూయడమే పూలకు తెలిసిన ప్రేమసుధ
రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమకథ
ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి
మురిసేటి గుణమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ





హా.. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ



ఏ జతనో ఎందుకో విడదీసి 
వెంటాడు వేటాడు ఆటే ప్రేమ
మౌనముతో మనసునే శృతిచేసి 
రాగాలు పలికించు పాటే ప్రేమ
శాశ్వత చరితల ఈ ప్రేమ మృత్యువు ఎరుగని చిరునామా
శ్వాసను మంగళహారతిగా వెలిగించేదే ఈ ప్రేమ
మరణాన్ని ఎదిరించి 
మరణాన్ని ఎదిరించి  మరుజన్మగా వచ్చి
మరణాన్ని ఎదిరించి  మరుజన్మగా వచ్చి
కరుణించు వరమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ





హా.. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ..త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ

0 comments:

Post a Comment