Song » Sarikotha Cheera / సరికొత్త చీర
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Soundarya / సౌందర్య ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
sarikotta cIra UhiMcinaanu saradaala sarigaMcu nEyiMcinaanu manasU mamata paDugU pEka cIralO citriMcinaanu idi ennO kalala kalanEta naa vannela raashikI siri jyOta naa vannela raashikI siri jyOta muccaTa golipE mogali pottuku muLLu vaasana oka aMdaM abhimaanaM gala aaDapillaku alaka kuluku oka aMdaM I aMdaalannI kalabOsaa nI koMguku ceMguna muDi vEstaa I aMdaalannI kalabOsaa nI koMguku ceMguna muDi vEstaa idi ennO kalala kalanEta naa vannela raashikI siri jyOta naa vannela raashikI siri jyOta cura cura cUpulu oka maaru nI ciru ciru navvulu oka maaru mUti virupulu oka maaru nuvvu mudduku siddhaM oka maaru nuvvu E kaLanunnaa maha baagE I cIra vishEShaM allaagE nuvvu E kaLanunnaa maha baagE I cIra vishEShaM allaagE sarikotta cIra UhiMcinaanu saradaala sarigaMcu nEyiMcinaanu manasU mamata paDugU pEka cIralO citriMcinaanu idi ennO kalala kalanEta naa vannela raashikI siri jyOta naa vannela raashikI siri jyOta
సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేయించినాను మనసూ మమత పడుగూ పేక చీరలో చిత్రించినాను ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికీ సిరి జ్యోత నా వన్నెల రాశికీ సిరి జ్యోత ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు ముళ్ళు వాసన ఒక అందం అభిమానం గల ఆడపిల్లకు అలక కులుకు ఒక అందం ఈ అందాలన్నీ కలబోసా నీ కొంగుకు చెంగున ముడి వేస్తా ఈ అందాలన్నీ కలబోసా నీ కొంగుకు చెంగున ముడి వేస్తా ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికీ సిరి జ్యోత నా వన్నెల రాశికీ సిరి జ్యోత చుర చుర చూపులు ఒక మారు నీ చిరు చిరు నవ్వులు ఒక మారు మూతి విరుపులు ఒక మారు నువ్వు ముద్దుకు సిద్ధం ఒక మారు నువ్వు ఏ కళనున్నా మహ బాగే ఈ చీర విశేషం అల్లాగే నువ్వు ఏ కళనున్నా మహ బాగే ఈ చీర విశేషం అల్లాగే సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేయించినాను మనసూ మమత పడుగూ పేక చీరలో చిత్రించినాను ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికీ సిరి జ్యోత నా వన్నెల రాశికీ సిరి జ్యోత
0 comments:
Post a Comment