Tuesday, July 14, 2020

Pelli Chesukundam » Kokila Kokila      పెళ్ళి చేసుకుందాం » కోకిల కోకిల

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Kokila Kokila / కోకిల కోకిల

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  , Soundarya / సౌందర్య  ,Music Director : Koti / కోటి ,Lyrics Writer : Sai Sriharsha / సాయి శ్రీహర్ష ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
kOkila kOkila kU annadi
vEcina aamani O yannadi
dEvata nIvani mamatala kOvela talupu tericivuMcaanu
priya priya jayI bhava kaugiLLalO
saKi saKi suKIbhava saMdiLLalO
kOkila kOkila kU annadi..ha..ha..
vEcina aamani O yannadi..ha..ha..



guMDe gUTilO niMDipOvaa prEma guvvalaaga uMDipOvaa
EDu aDugula tODu raavaa janma janma nannu nIDakaavaa
lOkaM mana lOgiligaa kaalaM mana kaugiLigaa
valapE shubha dIvenagaa bratukE priya bhaavanagaa
aa aakaashaalE aMdE vELa aashalu tIrenugaa..






kOkila kOkila kU annadi..ha..ha..
vEcina aamani O yannadi..ha..ha..



vaalu kaLLatO vIlunaamaa vIlu cUsi ivvu caalu bhaamaa
vELa paalalu Elanammaa vIlu lEnidaMTU lEdulEmmaa
manamElE prEmikulaM manadElE prEma kulaM
kaalaanni aapagalaM mana prEmanu cUpagalaM 
kallalannI tIrE kammani kShaNamE kannula muMduMdamma



kOkila kOkila kU annadi
vEcina aamani O yannadi
dEvata nIvani mamatala kOvela talupu tericivuMcaanu
priya priya jayI bhava kaugiLLalO
saKi saKi suKIbhava saMdiLLalO
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచివుంచాను
ప్రియ ప్రియ జయీ భవ కౌగిళ్ళలో
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
కోకిల కోకిల కూ అన్నది..హ..హ..
వేచిన ఆమని ఓ యన్నది..హ..హ..



గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నీడకావా
లోకం మన లోగిలిగా కాలం మన కౌగిళిగా
వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా..






కోకిల కోకిల కూ అన్నది..హ..హ..
వేచిన ఆమని ఓ యన్నది..హ..హ..



వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామా
వేళ పాలలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా
మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం
కాలాన్ని ఆపగలం మన ప్రేమను చూపగలం 
కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ



కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచివుంచాను
ప్రియ ప్రియ జయీ భవ కౌగిళ్ళలో
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో

0 comments:

Post a Comment