Song » Navvavaiah babu... / నవ్వవయ్యా బాబూ....
Song Details:Actor :
Jagapathi Babu / జగపతి బాబు ,Actress :
Kalyani / కళ్యాణి ,Music Director :
Chakri / చక్రి ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Chakri / చక్రి ,
Kausalya / కౌసల్య ,Song Category : Others
A: navvavayyA bAbU.... nI sommEM pOtuMdi.......nI sOkEM pOtuMdi ||2|| navvu dorabAbU.......! are nI kEmayyiMdi cirunavvE rAkuMdI ||2|| ADadilA veMTapaDI aDugutuMDagA mUtinalA muDucukunI eMtasEpaTA.... tega urimina AkaSAna navvu cinukulE navvu cinukulE...Oy pedabAbU.... ||navvavayyA|| mUTalE tarigEnA ....kOTalE kUlEnA navvitE OsAri ....koMpalE munigEnA viMtalE jarigEnA ....iMtalO EvainA navvitE manasArA...koMDalEM karigEnA nEnu cUDalEdurOy.... nuvvu navvagA aMta kOpameMdukOy.... varusaku bAvA... idigO I vELA navvAlA pakapakamani kilakilamani kAkula rodalA a: Ey... EMTI!? A: kOkilA SRutilA ||navvavayyA|| maNulE aDigAnA...mAnyAlaDigAnA nuv tappa EmainA... ninnu nEnaDigAnA nagalE aDigAnA... nANyAlaDigAnA cinna navvu kAkuMDA... cIralE aDigAnA dAcukOku navvunI pedavi cATunA PakkumaMTu navvitE cAlanukOnA cebutA viMTAvA ipuDainA paDipaDi nuvu navvara mari nA attakoDukA a: oLLelA vuMdE.....!? A: kAdani anakA... orEy pedabAbu a: navvu dorasAnI..... cirunavvula savvaDitO.... navvu saMdaDi cEyAli ||2|| navvu nIlavENi...... koMTenavvula pallakilO....ninu rOjU cUDAli ||2|| a: nityamalle puvvulAga nuvvu muddugA navvutuMTE mutyamaina sATirAdugA galagalamani navvutuMTE nAku paMDagA.....nAku paMDagA
ఆ: నవ్వవయ్యా బాబూ.... నీ సొమ్మేం పోతుంది.......నీ సోకేం పోతుంది ||౨|| నవ్వు దొరబాబూ.......! అరె నీ కేమయ్యింది చిరునవ్వే రాకుందీ ||౨|| ఆడదిలా వెంటపడీ అడుగుతుండగా మూతినలా ముడుచుకునీ ఎంతసేపటా.... తెగ ఉరిమిన ఆకశాన నవ్వు చినుకులే నవ్వు చినుకులే...ఓయ్ పెదబాబూ.... ||నవ్వవయ్యా|| మూటలే తరిగేనా ....కోటలే కూలేనా నవ్వితే ఓసారి ....కొంపలే మునిగేనా వింతలే జరిగేనా ....ఇంతలో ఏవైనా నవ్వితే మనసారా...కొండలేం కరిగేనా నేను చూడలేదురోయ్.... నువ్వు నవ్వగా అంత కోపమెందుకోయ్.... వరుసకు బావా... ఇదిగో ఈ వేళా నవ్వాలా పకపకమని కిలకిలమని కాకుల రొదలా అ: ఏయ్... ఏంటీ!? ఆ: కోకిలా శృతిలా ||నవ్వవయ్యా|| మణులే అడిగానా...మాన్యాలడిగానా నువ్ తప్ప ఏమైనా... నిన్ను నేనడిగానా నగలే అడిగానా... నాణ్యాలడిగానా చిన్న నవ్వు కాకుండా... చీరలే అడిగానా దాచుకోకు నవ్వునీ పెదవి చాటునా ఫక్కుమంటు నవ్వితే చాలనుకోనా చెబుతా వింటావా ఇపుడైనా పడిపడి నువు నవ్వర మరి నా అత్తకొడుకా అ: ఒళ్ళెలా వుందే.....!? ఆ: కాదని అనకా... ఒరేయ్ పెదబాబు అ: నవ్వు దొరసానీ..... చిరునవ్వుల సవ్వడితో.... నవ్వు సందడి చేయాలి ||౨|| నవ్వు నీలవేణి...... కొంటెనవ్వుల పల్లకిలో....నిను రోజూ చూడాలి ||౨|| అ: నిత్యమల్లె పువ్వులాగ నువ్వు ముద్దుగా నవ్వుతుంటే ముత్యమైన సాటిరాదుగా గలగలమని నవ్వుతుంటే నాకు పండగా.....నాకు పండగా
0 comments:
Post a Comment