Tuesday, July 14, 2020

Peda Rayudu » Kadile Kalamaa      పెదరాయుడు » కదిలే కాలమా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Kadile Kalamaa / కదిలే కాలమా

Song Details:Actor : Mohan Babu / మోహన్ బాబు , Soundarya / సౌందర్య  ,Music Director : Koti / కోటి ,Lyrics Writer : Sai Sriharsha / సాయి శ్రీహర్ష ,Singer : Chitra / చిత్ర  ,  K. Jesudasu / కె. జేసుదాసు  ,Song Category : Comedy Songs
kadilE kaalamaa kaasEpu aagavammaa
jarigE vEDuka kaLLaara cUDavammaa
pEgE kadalagaa
sImaMtamaayelE prEmadEvataku nEDE
kadilE kaalamaa kaasEpu aagavammaa



laaliMcE tallI paaliMcE taMDrI nEnElE nIkannI
kaanunna ammaa nI kaMTi cemma nE cUDalEnammaa
kannILLalO celikaaDinE nI kaDupulO pasivaaDinE
EnaaDu tODunu nIDanu vIDanulE



kadilE kaalamaa kaasEpu aagavammaa
pEgE kadalagaa
sImaMtamaayelE prEmadEvataku nEDE
jarigE vEDuka kaLLaara cUDavammaa



taatayya tEjaM pedanaanna naijaM 
kalisunna pasirUpaM
nI raaNitanamu naa raacaguNamu
okaTaina cirudIpaM
perigEnulE naa aMshamu..
veligEnulE maa vaMshamu..
ennennO taramulu taragani yashamulaku
ennO nOmulE gatamaMdu nOci uMTaa
nIkE bhaaryanai prati janmanaMdu uMTaa
naDicE daivamaa..
nI paadadhULulE pasupu kuMkumalu naaku
ennO nOmulE gatamaMdu nOci uMTaa
nIkE bhaaryanai prati janmanaMdu uMTaa
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా
పేగే కదలగా
సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా



లాలించే తల్లీ పాలించే తండ్రీ నేనేలే నీకన్నీ
కానున్న అమ్మా నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా
కన్నీళ్ళలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే
ఏనాడు తోడును నీడను వీడనులే




కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
పేగే కదలగా
సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా





తాతయ్య తేజం పెదనాన్న నైజం 
కలిసున్న పసిరూపం
నీ రాణితనము నా రాచగుణము
ఒకటైన చిరుదీపం
పెరిగేనులే నా అంశము..
వెలిగేనులే మా వంశము..
ఎన్నెన్నో తరములు తరగని యశములకు
ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా
నడిచే దైవమా..
నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు
ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా

0 comments:

Post a Comment