Song » Gandhi Puttina / గాంధి పుట్టిన
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Vanisree / వాణిశ్రీ ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
pallavi : gaaMdhi puTTina daeSamaa idi nehru kOrina saMghamaa idi IIgaaMdhiII saamyavaadaM raamaraajyaM saMbhaviMchae kaalamaa gaaMdhi puTTina daeSamaa... charaNaM : 1 sasyaSyaamala daeSaM ayinaa nityaM kshaamaM (2) uppoMgae nadula jeevajalaalu uppu samudraM paalu yuvakula Saktiki bhavitavyaaniki ikkaDa tilOdakaalu unnadi manakoo OTu bratuku teruvukae lOTu IIgaaMdhiII charaNaM : 2 samme gheraavu dommee bassula dahanaM looTee (2) SaaMti sahanaM samadharmaM pai virigenu gooMDaa laaThee adhikaaraMkai penugulaaTalO annaadammula pOTee hechchenu hiMsaadvaeshaM aemavutuMdee daeSaM IIgaaMdhiII charaNaM : 3 vyaapaaraalaku parmiT^ vyavahaaraalaku lesains^ arhatalaeni udyOgaalu laMchaM istae O yas^ siphaarsu laenidae SmaSaanamaMdu dorakadu ravaMta chOTu paeruku prajaladi raajyaM pettaMdaarlakae bhOjyaM IIgaaMdhiII
పల్లవి : గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది ॥గాంధి॥ సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధి పుట్టిన దేశమా... చరణం : 1 సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం (2) ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు ॥గాంధి॥ చరణం : 2 సమ్మె ఘెరావు దొమ్మీ బస్సుల దహనం లూటీ (2) శాంతి సహనం సమధర్మం పై విరిగెను గూండా లాఠీ అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ హెచ్చెను హింసాద్వేషం ఏమవుతుందీ దేశం ॥గాంధి॥ చరణం : 3 వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలకు లెసైన్స్ అర్హతలేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓ యస్ సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకే భోజ్యం ॥గాంధి॥
0 comments:
Post a Comment