Sunday, July 19, 2020

Pattudala » Epudu Oppukovadduraa      పట్టుదల » ఎపుడూ ఒప్పుకోవద్దురా

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Epudu Oppukovadduraa / ఎపుడూ ఒప్పుకోవద్దురా

Song Details:Actor : Suman / సుమన్ ,Actress : Aishwarya / ఐశ్వర్య ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : K. Jesudasu / కె. జేసుదాసు  ,Song Category : Club & Item Songs
epuDU oppukOvadduraa OTami
eppuDU vadulukOvadduraa Orimi
vishramiMcavaddu EkShaNaM vismariMcavaddu nirNayaM
apuDE nIjayaM nishcayaM raa
epuDU oppukOvadduraa OTami
eppuDU vadulukOvadduraa Orimi



noppilEni nimiShamEdi jananamainaa maraNamainaa
jIvitaana aDugu aDugunaa
nIrasiMci nilicipOtE nimiShamainaa nIdi kaadu
bratuku aMTE nitya GarShaNa
vEgamuMdi praaNamuMdi netturuMdi sottu uMdi
iMtakannaa sainyamuMDunaa
aasha nIku astramaunu shwaasa nIku shastramaunu
dIkSha kannaa saarathevaruraa
niraMtaraM prayatnamunnadaa
niraashakE niraasha puTTadaa
ninni miMci shakti Edi nIku nuvvu baasaTa ayitE



epuDU oppukOvadduraa OTami
eppuDU vadulukOvadduraa Orimi
vishramiMcavaddu EkShaNaM vismariMcavaddu nirNayaM
apuDE nIjayaM nishcayaM raa
epuDU oppukOvadduraa OTami
eppuDU vadulukOvadduraa Orimi



niMgi eMta goppadainaa rivvumanna guvvapilla
rekka muMdu takkuvEnuraa
saMdrameMta peddadainaa Idutunna cEpa pilla
moppa muMdu cinnadEnuraa
piDugu vaMTi piDikiletti urumuvalle hUMkaristE
dikkulannI prikkaTilluraa
aashayaala ashwamekki adupulEni kadanu tokki
avadhulannI adhikamiMcaraa
trivikramaa paraakramiMcaraa
vishaala vishwamaakramiMcaraa
jaladhi saitamaarpalEni jwaala Ole prajwaliMcuraa



epuDU oppukOvadduraa OTami
eppuDU vadulukOvadduraa Orimi
vishramiMcavaddu EkShaNaM vismariMcavaddu nirNayaM
apuDE nIjayaM nishcayaM raa
epuDU oppukOvadduraa OTami
eppuDU vadulukOvadduraa Orimi
ఎపుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏక్షణం విస్మరించవద్దు నిర్ణయం
అపుడే నీజయం నిశ్చయం రా
ఎపుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి



నొప్పిలేని నిమిషమేది జననమైనా మరణమైనా
జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
వేగముంది ప్రాణముంది నెత్తురుంది సొత్తు ఉంది
ఇంతకన్నా సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
దీక్ష కన్నా సారథెవరురా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ని మించి శక్తి ఏది నీకు నువ్వు బాసట అయితే




ఎపుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏక్షణం విస్మరించవద్దు నిర్ణయం
అపుడే నీజయం నిశ్చయం రా
ఎపుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి



నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల
మొప్ప ముందు చిన్నదేనురా
పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుమువల్లె హూంకరిస్తే
దిక్కులన్నీ ప్రిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి
అవధులన్నీ అధికమించరా
త్రివిక్రమా పరాక్రమించరా
విశాల విశ్వమాక్రమించరా
జలధి సైతమార్పలేని జ్వాల ఓలె ప్రజ్వలించురా




ఎపుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏక్షణం విస్మరించవద్దు నిర్ణయం
అపుడే నీజయం నిశ్చయం రా
ఎపుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

0 comments:

Post a Comment