Song » Matrudevobhava / మాతృదేవోభవ
Song Details:Actor :
Balakrishna / బాలకృష్ణ ,Actress :
Sneha / స్నేహ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ ,Singer :
M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి ,
Maalavika / మాళవిక ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
mAtRudEvOBava anna sUkti maricAnu pitRudEvOBava anna mATa viDicAnu nA painE nAkeMtO dvEShaMgA uMdammA nE cEsina pApAlaku niShkRuti lEdammA ammA okasAri ninnu cUsi canipOvAlani unnadi nAnna ani okkasAri pilici kanumUyAlani unnadi ammA... nAnnA... ammA... ||ammA okasAri|| ammA nI kalalE nA kaMTipApalayinavani lAli jOlAli nI prANaM panaMpeTTi nAku puruDu pOSAvani nI nettuTi muddayE nA aMdamayina dEhamani biDDa batuku dIpAniki talli pAlE camurani teliyanaiti tallI, eruganaitini ammA kaDupu tIpinE hELana cEsina julAyini kanna pEgumuDini teMpivEsina kasAyini maracipOyi kUDA nannu manniMcoddammA kalanainA nannu karuNiMcoddu nAnnA nAnnA nI guMDepaina naDaka nErcukunnAnani nI cUpuDu vElutO lOkAnnE cUSAnani nAnnanu pUjistE AdidEvunaku adi aMdunani ammaku brahmaku madhya nAnnE oka niccenani teliyanaiti taMDrI eruganaiti nAnnA nAnnaMTE naDIcE dEvAlayamani maricitini AtmajyOtini cEjEtulA ArpivEsukoMTini maracipOyi kUDA nannu manniMcoddammA kalanainA nanu karuNiMcoddu nAnnA||2||
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను పితృదేవోభవ అన్న మాట విడిచాను నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా... నాన్నా... అమ్మా... ||అమ్మా ఒకసారి|| అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావని నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని తెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మా కడుపు తీపినే హేళన చేసిన జులాయిని కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నను కరుణించొద్దు నాన్నా||2||
0 comments:
Post a Comment