Tuesday, July 14, 2020

Panduranga Mahathyam » Amma ani arachinaa      పాండురంగ మహత్మ్యం » అమ్మా అని అరచినా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Amma ani arachinaa / అమ్మా అని అరచినా
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Ghantasala / ఘంటసాల  ,Song Category : Sad & Patho songs
ammA.... nAnnA
ammA.... ammA ani aracinA AlakiMcavEmammA
AvEdana tIru rOju I janmaku lEdA ammA
padinelalu nanu mesi pAlicci peMci
madirOyaka nAkennO UDigAlu cEsina
O tallI ninu nalugurilO nagubATu cEsitI
talacakammA tanayuni
tappulu kShamiMcavammA.... ammA... ammA...



dEhamu vij~jAnamu brahmOpadESamicci
ihaparAlu sAdhiMcE hitamiccina taMDrini
kanugAnani kAmamuna iluveDala naDipitI
kanipistE kannILLatO kALLukaDugutA nAnnA... nAnnA....nAnnA...
mAripOtinammA nAgati erigitinammA
mI mATa dATanammA okamAru kanarammA
mAtApita pAdasEva mAdhavasEvEyani
maruvanamma mAtA
nannu manniMcagarArammA... ammA... ammA ammA ani



E pAda sIma kASI prayAgAdi pa
vitra BUmulakanna vimalataramu
E pAdapUja ramApati caraNAbja
pUjalakannanu puNyatamamu
E pAda tIrthamu pApa saMtApAgni
ArcagA jAlina amRutaJaramu
E pAdasmaraNa nAgEMdraSaya sudhyA
nammukannanu mahAnaMdakaramu
aTTi piturula padasEva Atma maraci
ihaparammulakeDamai tappiMcuvAru
kAvagalavAru lEru I jagAna vErE
nannu manniMci brOvumO ammA....
click here to hear the song
అమ్మా.... నాన్నా
అమ్మా.... అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా
పదినెలలు నను మెసి పాలిచ్చి పెంచి
మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితీ
తలచకమ్మా తనయుని
తప్పులు క్షమించవమ్మా.... అమ్మా... అమ్మా...



దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కనుగానని కామమున ఇలువెడల నడిపితీ
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళుకడుగుతా నాన్నా... నాన్నా....నాన్నా...
మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా
మీ మాట దాటనమ్మా ఒకమారు కనరమ్మా
మాతాపిత పాదసేవ మాధవసేవేయని
మరువనమ్మ మాతా
నన్ను మన్నించగరారమ్మా... అమ్మా... అమ్మా అమ్మా అని



ఏ పాద సీమ కాశీ ప్రయాగాది ప
విత్ర భూములకన్న విమలతరము
ఏ పాదపూజ రమాపతి చరణాబ్జ
పూజలకన్నను పుణ్యతమము
ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని
ఆర్చగా జాలిన అమృతఝరము
ఏ పాదస్మరణ నాగేంద్రశయ సుధ్యా
నమ్ముకన్నను మహానందకరము
అట్టి పితురుల పదసేవ ఆత్మ మరచి
ఇహపరమ్ములకెడమై తప్పించువారు
కావగలవారు లేరు ఈ జగాన వేరే
నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా....
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment