Wednesday, July 15, 2020

Pandava Vanavasam » Eka chakrapuraana      పాండవ వనవాసం » ఏక చక్రపురాన

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Eka chakrapuraana / ఏక చక్రపురాన
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category :
durO: sI ||Eka  cakrapurAna yeggu  siggulu  mAni 
       tiripemettinanADe tellamAye
BIma: tiripemettuTegAdu tigici jarAsaMdu
maTTijEsina jagajeTTi nEnu
duryO : mAdhavu mAyatO  magadhESu kUlcina
jayameMci jabbulu  caracukonaku
BIma: gaMdharvapati pASabaMdhammu vippi nI
paruvugAcinamATa  maracinAve
duryO: hA! marutunE kulasati  navamAnaparupa
mauna mUnina nATi nI magatanaMbu
BIma: A! dharma nirati naSaktigA talacunIdu
kanula poralu mApedanu IkShaName tuluva
దురో: సీ ||ఏక  చక్రపురాన యెగ్గు  సిగ్గులు  మాని
       తిరిపెమెత్తిననాడె తెల్లమాయె
భీమ: తిరిపెమెత్తుటెగాదు తిగిచి జరాసందు
మట్టిజేసిన జగజెట్టి నేను
దుర్యో : మాధవు మాయతో  మగధేశు కూల్చిన
జయమెంచి జబ్బులు  చరచుకొనకు
భీమ: గంధర్వపతి పాశబంధమ్ము విప్పి నీ
పరువుగాచినమాట  మరచినావె
దుర్యో: హా! మరుతునే కులసతి  నవమానపరుప
మౌన మూనిన నాటి నీ మగతనంబు
భీమ: ఆ! ధర్మ నిరతి నశక్తిగా తలచునీదు
కనుల పొరలు మాపెదను ఈక్షణమె తులువ

0 comments:

Post a Comment