Sunday, July 19, 2020

Okkadu » Atharintiki      ఒక్కడు » అత్తారింటికి

July 19, 2020 Posted by Publisher , No comments
Okkadu-Sarigama

Song » Atharintiki / అత్తారింటికి
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Hari Haran / హరిహరన్ ,  Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,Song Category : Devotional Songs
muttaidulaMtaa mudramaara I baalaki
maMgaLa snaanaalu cEyiMcarE
shrIraama rakShaNani kShIraabdi kanyaki 
mummaaru diShTi tIsi dIviMcarEmanasu paDE moguDostaaDani mEnaMtaa merisiMdi
meDisi paDE madilO saMdaDi mELaalai mOgiMdi
nIku naaku muMdE raasiMdi jODi harilO raMga hari
vahwaa aMTU cUstOMdi paMdiri
barilO hOraa hOri habu baaguMdi baajaa baajaMtari
attaariMTiki ninnettuku pOtaanugaa
vaccaanE haMsa vaibhOgaMgaa
kanyaatanamistaa kaLyaaNaM saakShigaa
doralaa dOcukupO yama darjaagaagelicaanE nI hRudayaM kalakaalaM vijayaM nItO paMcukOnaa
priyuraalaa naa praaNaM nI paapiTa siMdhUraMgaa nilapanaa
kalalannI I nimiShaM nijamayyE saMtOShaM naalO daacagalanaa
daricErE nIkOsaM cirunavvula nIraajanaM ivvanaa
mustaabu ceyyaraTE I muddula gummani
siggupaDu ceMpaki siri cukka diddarE
paTTucIra kaTTaraTE I puttaDi bommaki
taDabaDu kaaLLaki paaraaNi peTTarE
vagalannI niganigalaaDagaa nannallE kaugiLLO
nagalannI velavelabOvaa cEraMdE nI OLLO
naakE soMtaM kaani nI sommulannI
harilO raMga hari 
vahwaa aMTU cUstOMdi paMdiri
barilO hOraa hOri habu baaguMdi baajaa baajaMtariattaariMTiki ninnettuku pOtaanugaa
vaccaanE haMsa vaibhOgaMgaa
kanyaatanamistaa kaLyaaNaM saakShigaa
doralaa dOcukupO yama darjaagaaoTTEsi cebutunnaa kaDadaakaa naDipiMcE tODai nEnunnaa
EDaDugula payanaana EDEDu lOkaalainaa daaTanaa
vadhuvai edurostunnaa varamaalai edapaina vaalE muhUrtaana
varasayyE valapaMtaa cadivistaa varakaTnaMgaa sarEnaa
mukkOTi dEvatalu makkuvagaa kalipaarE
ennenni janmaladO I koMgumuDi
mutyaala jallugaa akShiMtalu vEyyaalE
muccaTa tIrElaa aMtaa raMDI
EnaaDU evarU cErani EkaaMtaM vetakaali
E kannU epuDU cUDani lOkaMlO batakaali
pagalu rEyi lEni jagamElukOni
harilO raMga hari 
vahwaa aMTU cUstOMdi paMdiri
barilO hOraa hOri habu baaguMdi baajaa baajaMtari


attaariMTiki ninnettuku pOtaanugaa
vaccaanE haMsa vaibhOgaMgaa
kanyaatanamistaa kaLyaaNaM saakShigaa
doralaa dOcukupO yama darjaagaa
attaariMTiki ninnettuku pOtaanugaa
vaccaanE haMsa vaibhOgaMgaa
kanyaatanamistaa kaLyaaNaM saakShigaa
doralaa dOcukupO yama darjaagaa
ముత్తైదులంతా ముద్రమార ఈ బాలకి
మంగళ స్నానాలు చేయించరే
శ్రీరామ రక్షణని క్షీరాబ్ది కన్యకి 
ముమ్మారు దిష్టి తీసి దీవించరే
మనసు పడే మొగుడొస్తాడని మేనంతా మెరిసింది
మెడిసి పడే మదిలో సందడి మేళాలై మోగింది
నీకు నాకు ముందే రాసింది జోడి హరిలో రంగ హరి
వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి హబు బాగుంది బాజా బాజంతరి
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా

గెలిచానే నీ హృదయం కలకాలం విజయం నీతో పంచుకోనా
ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా
కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా
దరిచేరే నీకోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా
ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దుల గుమ్మని
సిగ్గుపడు చెంపకి సిరి చుక్క దిద్దరే
పట్టుచీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకి
తడబడు కాళ్ళకి పారాణి పెట్టరే
వగలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిళ్ళో
నగలన్నీ వెలవెలబోవా చేరందే నీ ఓళ్ళో
నాకే సొంతం కాని నీ సొమ్ములన్నీ
హరిలో రంగ హరి 
వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి హబు బాగుంది బాజా బాజంతరి

అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా

ఒట్టేసి చెబుతున్నా కడదాకా నడిపించే తోడై నేనున్నా
ఏడడుగుల పయనాన ఏడేడు లోకాలైనా దాటనా
వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎదపైన వాలే ముహూర్తాన
వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా సరేనా
ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే
ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి
ముత్యాల జల్లుగా అక్షింతలు వేయ్యాలే
ముచ్చట తీరేలా అంతా రండీ
ఏనాడూ ఎవరూ చేరని ఏకాంతం వెతకాలి
ఏ కన్నూ ఎపుడూ చూడని లోకంలో బతకాలి
పగలు రేయి లేని జగమేలుకోని
హరిలో రంగ హరి 
వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి హబు బాగుంది బాజా బాజంతరి

అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా

0 comments:

Post a Comment