Tuesday, July 28, 2020

O Papa Lali » Mate raani      ఓ పాపా లాలీ » మాటే రాని

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Mate raani / మాటే రాని

Song Details:Actor : S.P.Balu / ఎస్.పి.బాలు  ,Actress : Raadhika / రాధిక ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
maaTE raani cinnadaani kaLLu palikE Usulu..
aMdaalannI pallaviMcI aalapiMcE paaTalu..
prEmE naaku paMcE..j~jaapakaaluraa..
rEgE mUga talapE..valapu paMTaraa!!



maaTE raani cinnadaani kaLLu palikE Usulu..
aMdaalannI pallaviMcI aalapiMcE paaTalu..
prEmE naaku paMcE..j~jaapakaaluraa..
rEgE mUga talapE..valapu paMTaraa!!



vennelallER pUlu virisE tEnelu cilikenu..
ceMtacEri aadamaraci prEmalu kosarenu..
caMdanaalu jallu kurise cUpulu kalisenu..
caMdamaama paTTapagalE niMgini poDicenu!!



kanne pilla kalalE naakika lOkaM..
sannajaaji kaLalE mOhana raagaM..
cilakala palukulu alakala ulukulu
naa celi sogasulu nannE maripiMcE!!



maaTE raani cinnadaani kaLLu palikE Usulu..
aMdaalannI pallaviMcI aalapiMcE paaTalu..



muddabaMti lEta navvulu ciMdenu madhuvulu..
UsulaaDu mEni vagalu vannela jilugulu..
harivillulOni raMgulu naaceli sogasulu
vEkuvala mElukolupE  naa celi pilupulu



saMdevELa palikE naalO pallavi..
saMtasaala sirulE naavE annavi..
musi musi talapulu taragani valapulu..
naa celi sogasulu annI ika naavE!!



maaTE raani cinnadaani kaLLu palikE Usulu..
aMdaalannI pallaviMcI aalapiMcE paaTalu..
prEmE naaku paMcE..j~jaapakaaluraa..
rEgE mUga talapE..valapu paMTaraa!!



maaTE raani cinnadaani kaLLu palikE Usulu..
aMdaalannI pallaviMcI aalapiMcE paaTalu..
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
రేగే మూగ తలపే..వలపు పంటరా!!



మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
రేగే మూగ తలపే..వలపు పంటరా!!




వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను..
చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను..
చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను..
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!!



కన్నె పిల్ల కలలే నాకిక లోకం..
సన్నజాజి కళలే మోహన రాగం..
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే!!





మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..



ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు..
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు..
హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు
వేకువల మేలుకొలుపే  నా చెలి పిలుపులు



సందెవేళ పలికే నాలో పల్లవి..
సంతసాల సిరులే నావే అన్నవి..
ముసి ముసి తలపులు తరగని వలపులు..
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!!





మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
రేగే మూగ తలపే..వలపు పంటరా!!



మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..

0 comments:

Post a Comment