Song » Akaasam digivachchi / ఆకాశం దిగివచ్చి
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ ,Music Director :
Koti / కోటి ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : aakaaSaM digivachchi mabbulatO veyyaali mana paMdiri (2) ooraMtaa cheppukunae muchchaTagaa jaragaali peLlaMTae mari cheri sagamavamani manasulu kaluputu tera terichina taruNaM idi varakeragani varasalu kaluputu murisina baMdhu janaM maa iLla laeta maaviLla tOraNaalannee peLli Subhalaekhalae akshiMtalaesi aaSeervadiMchamanu pilupulainavee gaalulae IIaakaaSaMII charaNaM : 1 cheMpalO viraboosae ammaayi siggu doMtaralu aa soMpulaku eravaesae abbaayi choopu toMdaralu ae varaalu ee javaraalai jatapaDu samayaMlO vaana villae vadhuvuga maari odigina vaeDukalO tana sarasana virisina siri siri sogasula kulukula kaluvaku kaanukagaa eda sarasuna egisina alajaDi alalae taakagaa dheeMtaka deeMtaka deeMtaka takadheeM (2) IIaakaaSaMII charaNaM : 2 vinna vaarevarasalu sannaayi vaari saMgatulu sana sannagaa rusarusalu viyyaala vaari busabusalu saMdu choosi chaka chaka aaDe jooda SikhaamaNulu paMdiraMtaa ghumaghumalaaDae viMdu suvaasanalu tama niga niga nagalanu paduguri edurugaa idigidigO ani choopeDutoo tega tirigae taruNula tikamaka parugulu chooDagaa IIaakaaSaMII
పల్లవి : ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి (2) ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం మా ఇళ్ల లేత మావిళ్ల తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవీ గాలులే ॥ఆకాశం॥ చరణం : 1 చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వాన విల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో తన సరసన విరిసిన సిరి సిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగిసిన అలజడి అలలే తాకగా ధీంతక దీంతక దీంతక తకధీం (2) ॥ఆకాశం॥ చరణం : 2 విన్న వారెవరసలు సన్నాయి వారి సంగతులు సన సన్నగా రుసరుసలు వియ్యాల వారి బుసబుసలు సందు చూసి చక చక ఆడె జూద శిఖామణులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ నిగ నిగ నగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ॥ఆకాశం॥
0 comments:
Post a Comment