Monday, July 20, 2020

Nee Sneham » Kontham Kaalam Kindata      నీ స్నేహం » కొంతకాలం కిందట

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Kontham Kaalam Kindata / కొంతకాలం కిందట

Song Details:Actor : Uday Kiran / ఉదయ్ కిరణ్ ,Actress : Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ ,Music Director : RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : R.P.Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,  Rajesh / రాజేశ్ ,Song Category : Club & Item Songs
koMtakaalaM kiMdaTa brahma dEvuni muMgiTa 
reMDu aatmalu vEDukunnavi O varaM
rUpu rEKalu vEraTa UpirokaTE caalaTa
aa varaannE snEhamaMTunnaaM manaM
kaMTipaapani kaapu kaasE jaMTa reppala kaapalaagaa
niMDu celimiki nuvvU nEnu nIDanivvaali
snEhamaMTE rUpulEni Uhakaadani lOkamaMtaa
ninnU nannU cUDagaanE nammitIraali
koMtakaalaM kiMdaTa brahma dEvuni muMgiTa 
reMDu aatmalu vEDukunnavi O varaM



bommaa borusulEni naaNEniki viluvuMTuMdaa 
manamiddaramU puTTuMDakapOtE celimiki viluvuMdaa
sUryuDU caMdruDU lEni gaganaaniki veluguTuMdaa
mana kannulalO koluvuMDakapOtE celimiki veluguMdaa
galagalamani sirimuvvagaa kalaterugani cirunavvugaa
naa edalayalE tana madhurimalai paaDaali nI snEhaM



koMtakaalaM kiMdaTa brahma dEvuni muMgiTa 
reMDu aatmalu vEDukunnavi O varaM



vivaristunnadi addaM mana anubaMdhaaniki ardhaM
nuvvu naalaagaa nEnnIlaagaa kanipiMcaDamE satyaM
nuvvu cUsE prati swapnaM naa raatiri daariki dIpaM
nI kala nijamai kanipiMcanidE nidariMcanuraa nEstaM
gelupunu tarimE aaTagaa nilavani parugulu tIyagaa
mana praaNaalE tana paadaalai saagaali nI snEhaM



koMtakaalaM kiMdaTa brahma dEvuni muMgiTa 
reMDu aatmalu vEDukunnavi O varaM
rUpu rEKalu vEraTa UpirokaTE caalaTa
aa varaannE snEhamaMTunnaaM manaM
kaMTipaapani kaapu kaasE jaMTa reppala kaapalaagaa
niMDu celimiki nuvvU nEnu nIDanivvaali
snEhamaMTE rUpulEni Uhakaadani lOkamaMtaa
ninnU nannU cUDagaanE nammitIraali
 
Click here to hear the song
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు వేడుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు వేడుకున్నవి ఓ వరం



బొమ్మా బొరుసులేని నాణేనికి విలువుంటుందా 
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడూ చంద్రుడూ లేని గగనానికి వెలుగుటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం



కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు వేడుకున్నవి ఓ వరం



వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం
నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదరించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి నీ స్నేహం



కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు వేడుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి



 

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment