
Song » Vintunnava Nestham / వింటున్నావా నేస్తం
Song Details:Actor :
Sachiin / సచిన్ ,Actress :
Nazia Hussain / నజియా హుస్సేన్ ,Music Director :
Jeet Ganguly,Ankit Tiwari,Mithoon / జీత్ గంగూలి, అంకిత్ తివారి, మిథున్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Arijit Singh / అరిజిత్ సింగ్ ,Song Category : Love & Romantic Songs
pallavi: AnaMdaM urakalu vEstE gAnaM nEstaM...nEstaM.... spaMdiMcE hRudayAlu aMdiMcE cappaTlu A SabdaMlOnE vuMdi aMtElEni saMtOShaM harShiMcE adharAlu varShiMcE dIvenalu A maMtraMlOnE vuMdi avadhE lEni AnaMdaM AnaMdaM urakalu vEstE gAnaM AvEdana manasunu mUstE maunaM viMTunnAvA nEstaM mauna saMgItaM viMTunnAvA nEstaM nA mauna saMgItaM caraNaM: kalalu kannILLu kOTlAdi ASalu Silalu SilpAlu mATlADu BAShalu anniMTa tanE prANaM A prANa svaraM maunaM AnaMdaM urakalu vEstE gAnaM AvEdana manasunu mUstE maunaM viMTunnAvA nEstaM mauna gItaM caraNaM: BUmi gaganaMtO ADEnu vUsulu bratuku maraNaMtO cEsEnu BAShalu anniMTikidi mUlaM anAdi kathE maunaM AnaMdaM vurakalu vEstE gAnaM AvEdana manasunu mUstE maunaM viMTunnAvA nEstaM mauna saMgItaM viMTunnAvA nEstaM nA mauna saMgItaM viMTunnAvA nEstaM.......nEstaM.....
పల్లవి: ఆనందం ఉరకలు వేస్తే గానం నేస్తం...నేస్తం.... స్పందించే హృదయాలు అందించే చప్పట్లు ఆ శబ్దంలోనే వుంది అంతేలేని సంతోషం హర్షించే అధరాలు వర్షించే దీవెనలు ఆ మంత్రంలోనే వుంది అవధే లేని ఆనందం ఆనందం ఉరకలు వేస్తే గానం ఆవేదన మనసును మూస్తే మౌనం వింటున్నావా నేస్తం మౌన సంగీతం వింటున్నావా నేస్తం నా మౌన సంగీతం చరణం: కలలు కన్నీళ్ళు కోట్లాది ఆశలు శిలలు శిల్పాలు మాట్లాడు భాషలు అన్నింట తనే ప్రాణం ఆ ప్రాణ స్వరం మౌనం ఆనందం ఉరకలు వేస్తే గానం ఆవేదన మనసును మూస్తే మౌనం వింటున్నావా నేస్తం మౌన గీతం చరణం: భూమి గగనంతో ఆడేను వూసులు బ్రతుకు మరణంతో చేసేను భాషలు అన్నింటికిది మూలం అనాది కథే మౌనం ఆనందం వురకలు వేస్తే గానం ఆవేదన మనసును మూస్తే మౌనం వింటున్నావా నేస్తం మౌన సంగీతం వింటున్నావా నేస్తం నా మౌన సంగీతం వింటున్నావా నేస్తం.......నేస్తం.....
0 comments:
Post a Comment