Song » Yevari Kosam / ఎవ్వరి కోసం
Song Details:Actor :
Shobhan Babu / శోభన్ బాబు ,Actress :
L. Vijayalakshmi / ఎల్. విజయలక్ష్మి ,Music Director :
Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
aBi: evvari kOsaM I maMdahAsaM okapari vivariMcavE sogasarI uttara: celimi kOsaM celi maMdahAsaM Emani vivariMtunO gaDusari aBi: valapulu cilikE vagalADi cUpu piluvaka pilicI virahAla rEpu uttara: edalO medalE celikAni rUpu EvO teliyani BAvAla rEpu iruvuru: I nayagAraM prEma sarAgaM aMdiMcu aMdani saMbarAlE ||evvari kOsaM|| aBi: parugulu tIsE javarAli vayasu merupai merasi marapiMcu manasu uttara: praNayamu ciMdE sarasAla caMdaM iruvuri nokaTiga penavEyu baMdhaM iruvuru: I vayyAraM, I siMgAraM ciMdiMcu cinni cinni vannelennO ||evvari kOsaM|| Click here to hear the song
అభి: ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సొగసరీ ఉత్తర: చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతునో గడుసరి అభి: వలపులు చిలికే వగలాడి చూపు పిలువక పిలిచీ విరహాల రేపు ఉత్తర: ఎదలో మెదలే చెలికాని రూపు ఏవో తెలియని భావాల రేపు ఇరువురు: ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందని సంబరాలే ||ఎవ్వరి కోసం|| అభి: పరుగులు తీసే జవరాలి వయసు మెరుపై మెరసి మరపించు మనసు ఉత్తర: ప్రణయము చిందే సరసాల చందం ఇరువురి నొకటిగ పెనవేయు బంధం ఇరువురు: ఈ వయ్యారం, ఈ సింగారం చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో ||ఎవ్వరి కోసం|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment