Song » Anumgu nekki / ఏనుంగు నెక్కి
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,Lyrics Writer :
Thikkana Somayaji / తిక్కన సోమయాజి ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Poems etc
sI|| EnuMgu nekki, pekkEnuMgu lirugaDa rA pura vIdhula grAla galade maNimayaMbaina BUShaNa jAlamula noppi yoDDOlagaMbuna nuMDagalade karpUra caMdana kastUri kAdula niMpu sopAra BOgiMpagalade ati manOharalagu caturAMganala tODi saMgati vEDkalu salupagalade tE || kayyamuna ODipOyina kauravEMdra vinumu nA buddi marali, yI tanuvu viDici sugati vaDayumu tolliMTa cUragalade jUdamiccaTa nADaMgarAdu nammu
సీ|| ఏనుంగు నెక్కి, పెక్కేనుంగు లిరుగడ రా పుర వీధుల గ్రాల గలదె మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదె కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొపార భోగింపగలదె అతి మనోహరలగు చతురాంగనల తోడి సంగతి వేడ్కలు సలుపగలదె తే || కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ది మరలి, యీ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింట చూరగలదె జూదమిచ్చట నాడంగరాదు నమ్ము
0 comments:
Post a Comment