Thursday, July 16, 2020

Nalugu Stambalata » Chinukula raali      నాలుగు స్తంభాలాట » చినుకులా రాలి

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Chinukula raali / చినుకులా రాలి

Song Details:Actor : Naresh / నరేష్ ,  Pradeep / ప్రదీప్ ,Actress : Purnima / పూర్ణిమ  ,Music Director : Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
cinukulaa raali..nadulugaa poMgI..

varadalai pOyi..kaDaligaa poMgu..

nI prEma..naa prEma..nI pErE naa prEma

nadivi nIvu..kaDali nEnu

maraci pObOkumaa..mamata nIvE sumaa..



cinukulaa raali..nadulugaa poMgI..

varadalai pOyi..kaDaligaa poMgu..

nI prEma..naa prEma..nI pErE naa prEma



aakulu raalE vEsavi gaali naa prEma niTTUrpulE

kuMkuma pUsi vEkuva nIvai tEvaali OdaarpulE



prEmalu kOrE janmalalOnE nE vEci uMTaanulE..

janmalu taakE prEmanu nEnai nE velluvautaanulE..velluvautaanulE



himamulaa raali..sumamulai pUsi..

Rutuvulai navvi.. madhuvulai poMgi

nI prEma..naa prEma..nI pErE naa prEma

shishiramainaa..shithilamainaa..viDici pObOkumaa.. virahamai pOkumaa..



tolakari kOsaM toDimenu nEnai allaaDutunnaanulE

pulakaramUdE puvvula kOsaM vEsaarutunnaanulE



niMgiki nEla aMTisalaaDE aa poddu raavaalilE

punnami nEDai rEpaTi nIDai aa muddu tIraalilE..aa tIraalu cEraalilE



maunamai velasi..gaanamai pilici

kalalatO alisi..gaganamai egasi

I prEma.. naa prEma..taaraaDE mana prEma..

bhuvanamainaa.. gaganamainaa..prEma mayamE sumaa!prEma manamE sumaa!



cinukulaa raali..nadulugaa poMgI..

varadalai pOyi..kaDaligaa poMgu..

nI prEma..naa prEma..nI pErE naa prEma

nadivi nIvu..kaDali nEnu

maraci pObOkumaa..mamata nIvE sumaa..
చినుకులా రాలి..నదులుగా పొంగీ..

వరదలై పోయి..కడలిగా పొంగు..

నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ

నదివి నీవు..కడలి నేను

మరచి పోబోకుమా..మమత నీవే సుమా..



చినుకులా రాలి..నదులుగా పొంగీ..

వరదలై పోయి..కడలిగా పొంగు..

నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ



ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే

కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే



ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే..

జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే..వెల్లువౌతానులే



హిమములా రాలి..సుమములై పూసి..

ఋతువులై నవ్వి.. మధువులై పొంగి

నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ

శిశిరమైనా..శిథిలమైనా..విడిచి పోబోకుమా.. విరహమై పోకుమా..



తొలకరి కోసం తొడిమెను నేనై అల్లాడుతున్నానులే

పులకరమూదే పువ్వుల కోసం వేసారుతున్నానులే



నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే

పున్నమి నేడై రేపటి నీడై ఆ ముద్దు తీరాలిలే..ఆ తీరాలు చేరాలిలే



మౌనమై వెలసి..గానమై పిలిచి

కలలతో అలిసి..గగనమై ఎగసి

ఈ ప్రేమ.. నా ప్రేమ..తారాడే మన ప్రేమ..

భువనమైనా.. గగనమైనా..ప్రేమ మయమే సుమా!ప్రేమ మనమే సుమా!



చినుకులా రాలి..నదులుగా పొంగీ..

వరదలై పోయి..కడలిగా పొంగు..

నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ

నదివి నీవు..కడలి నేను

మరచి పోబోకుమా..మమత నీవే సుమా..

0 comments:

Post a Comment