Tuesday, July 21, 2020

Naani » Naaku nuvvu      నాని » నాకు నువ్వు

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Naaku nuvvu / నాకు నువ్వు
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Amisha patel / అమీషా పటేల్  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Hari Haran / హరిహరన్ ,  Poornima / పూర్ణిమ ,Song Category : Others
pallavi:

nAku nuvvu nIku nInu okkaTaitE nuvvu nEnu

lOkamaMTE manamE aMdAmA....

okka nuvvu okka nEnu ekkuvaitE oppukOnu

iMtakaMTE eMdukanukuMdAmA...

iShTaM vaccinaTlu uMdAM

tOcinaTlu cEddAM

iShTaM vaccinaTlu uMdAM tOcinaTlu cEddAM

samayAnnE velEddAM, sarasAnnE piluddAM

samayAnnE velEddAM, sarasAnnE piluddAM

I EkAMtaM manakE soMtaM, I maikaM oDilO EkaM avudAM... nAku nuvvu
caraNaM:

caMTi pApalAMTi manasunnavADu

koMTe kRuShNuDalle maha tuMTarODu

manmathuDi kannA goppa aMdagADu

nA madinE dOcESADu

evarE aMtaTi monagADu

EDE ekkaDa unnADu

vADEnA nI jatagADu

vadilEstAvA nA tODu

sari sATilEni A magavADu

okaDaMTE okkaTE unnADu

iTu cUDu ilAga nA kaMTi pApalO nuvvE A okkaDu  nAku nuvvu
caraNaM:

caMdamAma siggupaDi tappukOni siggulEni jaMTa idi anukuni

cakkanaina ninnu cUsi cukkalanni AkASaMlO dAkkoni

aMdaM unnadi nI kOsaM

iMdA annadi sahavAsaM

nItOnE nA kailAsaM

nuvvEgA nA saMtOShaM

iMkokkasArilA I satyaM

oTTEsi ceppani nI snEhaM

suDi gAlilAga celarEgi pOdA mari nAlO utsAhaM nAku nuvvu
 
Click here to hear the song
పల్లవి:

నాకు నువ్వు నీకు నీను ఒక్కటైతే నువ్వు నేను

లోకమంటే మనమే అందామా....

ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతే ఒప్పుకోను

ఇంతకంటే ఎందుకనుకుందామా...

ఇష్టం వచ్చినట్లు ఉందాం

తోచినట్లు చేద్దాం

ఇష్టం వచ్చినట్లు ఉందాం తోచినట్లు చేద్దాం

సమయాన్నే వెలేద్దాం, సరసాన్నే పిలుద్దాం

సమయాన్నే వెలేద్దాం, సరసాన్నే పిలుద్దాం

ఈ ఏకాంతం మనకే సొంతం, ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం... నాకు నువ్వు
చరణం:

చంటి పాపలాంటి మనసున్నవాడు

కొంటె కృష్ణుడల్లె మహ తుంటరోడు

మన్మథుడి కన్నా గొప్ప అందగాడు

నా మదినే దోచేశాడు

ఎవరే అంతటి మొనగాడు

ఏడే ఎక్కడ ఉన్నాడు

వాడేనా నీ జతగాడు

వదిలేస్తావా నా తోడు

సరి సాటిలేని ఆ మగవాడు

ఒకడంటే ఒక్కటే ఉన్నాడు

ఇటు చూడు ఇలాగ నా కంటి పాపలో నువ్వే ఆ ఒక్కడు  నాకు నువ్వు
చరణం:

చందమామ సిగ్గుపడి తప్పుకోని సిగ్గులేని జంట ఇది అనుకుని

చక్కనైన నిన్ను చూసి చుక్కలన్ని ఆకాశంలో దాక్కొని

అందం ఉన్నది నీ కోసం

ఇందా అన్నది సహవాసం

నీతోనే నా కైలాసం

నువ్వేగా నా సంతోషం

ఇంకొక్కసారిలా ఈ సత్యం

ఒట్టేసి చెప్పని నీ స్నేహం

సుడి గాలిలాగ చెలరేగి పోదా మరి నాలో ఉత్సాహం నాకు నువ్వు
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment