Song » Mounamgaane / మౌనంగానే
Song Details:Actor :
Ravi teja / రవి తేజ ,Actress :
Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Chitra / చిత్ర ,Song Category : Club & Item Songs
maunaMgaanE edagamani mokka nIku cebutuMdi edigina koddI odagamanI ardamaMdulO uMdi maunaMgaanE edagamani mokka nIku cebutuMdi edigina koddI odagamanI ardamaMdulO uMdi apajayaalu kaligina cOTE gelupu pilupu vinipistuMdi aakulannI raalina cOTE kotta ciguru kanipistuMdi maunaMgaanE edagamani mokka nIku cebutuMdi edigina koddI odagamanI ardamaMdulO uMdi apajayaalu kaligina cOTE gelupu pilupu vinipistuMdi aakulannI raalina cOTE kotta ciguru kanipistuMdi dUrameMtO uMdani digulu paDaku nEstamaa dariki cErcu daarulu kUDaa unnaayigaa bhaarameMtO uMdani bhaadapaDaku nEstamaa bhaada veMTa navvula paMTa uMTuMdigaa saagara mathanaM modalavagaanE viShamE vacciMdi visugE ceMdaka kRuShi cEstEnE amRutamicciMdi avarOdhaala dIvullO aanaMda nidhi unnadi kaShTaala vaaradhi daaTina vaariki soMtamavutuMdi telusukuMTE satyamidi talacukuMTE saadhyamidi maunaMgaanE edagamani mokka nIku cebutuMdi edigina koddI odagamanI ardamaMdulO uMdi cemaTanIru ciMdagaa nudiTi raata maarcukO maarcalEnidEdI lEdanI gurtuMcukO piDikilE bigiMcagaa cEtigIta maarcukO maaripOni kathalE lEvani gamaniMcukO tOcinaTTugaa aMdari raatalu brahmE raastaaDu naccinaTTugaa nI talaraatanu nuvvE raayaali nI dhairyaanni darshiMci daivaalE taladiMcagaa nI aDugullO guDikaTTi swargaalE tariyiMcagaa nI saMkalpaaniki aa vidhi saitaM cEtulettaali aMtulEni caritalaki aadi nuvvu kaavaali maunaMgaanE edagamani mokka nIku cebutuMdi edigina koddI odagamanI ardamaMdulO uMdi apajayaalu kaligina cOTE gelupu pilupu vinipistuMdi aakulannI raalina cOTE kotta ciguru kanipistuMdi Click here to hear the song
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్దమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్దమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్దమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని భాదపడకు నేస్తమా భాద వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్దమందులో ఉంది చెమటనీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదనీ గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్దమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment