Song » Muthyamantha Pasupu / ముత్యమంతా పసుపు
Song Details:Actor :
Sreedhar / శ్రీధర్ ,Actress :
Sangeetha (Mutyala muggu) / సంగీత (ముత్యాల ముగ్గు) ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Inspiring & Motivational Songs
mutyamaMtaa pasupu muKameMtO Caaya muttaidu kuMkuma batukaMta Caaya mutyamaMtaa pasupu muKameMtO Caaya muttaidu kuMkuma batukaMta Caaya muddu muripaalaloluku muMgiLLalOna mUDu puvvulu aaru kaayallu kaaya mutyamaMtaa pasupu muKameMtO Caaya muttaidu kuMkuma batukaMta Caaya... aranaidOtanamu E cOTa nuMDu arugulalikEvaari aracEtanuMDu aranaidOtanamu E cOTa nuMDu arugulalikEvaari aracEtanuMDu tIraina saMpada evariMTanuMDu tIraina saMpada evariMTanuMDu dina dinamu muggunna lOgiLLanuMDu mutyamaMtaa pasupu muKameMtO Caaya muttaidu kuMkuma batukaMta Caaya kOTalO tulisemma koluvunna tIru kOrikolicEvaari koMgubaMgaaru kOTalO tulisemma koluvunna tIru kOrikolicEvaari koMgubaMgaaru gOvumaalakShmiki kOTi daMDaalu gOvumaalakShmiki kOTi daMDaalu kOrinaMta paaDi niMDu kaDavaLLu aa.. mutyamaMtaa pasupu muKameMtO Caaya muttaidu kuMkuma batukaMta Caaya... mogaDu meccinacaana kaapuraMlOna mogalipUla gaali mutyaala vaana mogaDu meccinacaana kaapuraMlOna mogalipUla gaali mutyaala vaana iMTi illaaliki eMta saubhaagyaM iMTi illaaliki eMta saubhaagyaM iMTillipaadiki aMtavaibhOgaM mutyamaMtaa pasupu muKameMtO Caaya muttaidu kuMkuma batukaMta Caaya muddu muripaalaloluku muMgiLLalOna mUDu puvvulu aaru kaayallu kaaya mutyamaMtaa pasupu muKameMtO Caaya muttaidu kuMkuma batukaMta Caaya... Click here to hear the song
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురిపాలలొలుకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ... అరనైదోతనము ఏ చోట నుండు అరుగులలికేవారి అరచేతనుండు అరనైదోతనము ఏ చోట నుండు అరుగులలికేవారి అరచేతనుండు తీరైన సంపద ఎవరింటనుండు తీరైన సంపద ఎవరింటనుండు దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరికొలిచేవారి కొంగుబంగారు కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి కోరికొలిచేవారి కొంగుబంగారు గోవుమాలక్ష్మికి కోటి దండాలు గోవుమాలక్ష్మికి కోటి దండాలు కోరినంత పాడి నిండు కడవళ్ళు ఆ.. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ... మొగడు మెచ్చినచాన కాపురంలోన మొగలిపూల గాలి ముత్యాల వాన మొగడు మెచ్చినచాన కాపురంలోన మొగలిపూల గాలి ముత్యాల వాన ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటిల్లిపాదికి అంతవైభోగం ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురిపాలలొలుకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment