Song » Bangaru Kalla Buchchemmo / బంగారు కళ్ల బుచ్చెమ్మో
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
Udit Narayan / ఉదిత్ నారాయణ్ ,Song Category : Others
pallavi : baMgAru kaLla buccemmO ceMgAvi ceMpa laccammO || kOpaMlO eMtO muddammO O buMgamUti subbammO saMde poddullO muddabaMtallE eMta muddugunnAvE veMDimuvvalle GallumaMTuMTE guMDe JallumannAdE || caraNaM : 1 nIlO ciMtaciguru pulupunnadE bulbul piTTa malmal maTTa kavvaMlAga cilikE kulukunnadE taLukula guTTa merupula taTTa nIlO ciMtaciguru pulupunnadE kavvaMlAga cilikE kulukunnadE koMTemATa venuka canuvunnadE telusukuMTE manasu pilupunnadE kaLlumUsi cIkaTi uMdaMTE vennela navvukuMTuMdE musugE lEkuMTE manasE jagAna velugai nilici uMTuMdE || caraNaM : 2 ninna nEDu rEpu oka niccena sirisiri muvva gaDasari guvva manaku manaku celimE oka vaMtena sogasula muvvA musimusi navvA ninna nEDu rEpu oka niccena manaku manaku celimE oka vaMtena evarikE vArai uMTE EmuMdammA muraLi kAni vedurai pOdA janma cEyi cEyi kalipE kOsamE hRudayaM iccADammAyI jAripOyAka tirigi rAdammO kAlaM mAyamarAThI || Click here to hear the song
పల్లవి : బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో ॥ కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో సందె పొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమన్నాదే ॥ చరణం : 1 నీలో చింతచిగురు పులుపున్నదే బుల్బుల్ పిట్ట మల్మల్ మట్ట కవ్వంలాగ చిలికే కులుకున్నదే తళుకుల గుట్ట మెరుపుల తట్ట నీలో చింతచిగురు పులుపున్నదే కవ్వంలాగ చిలికే కులుకున్నదే కొంటెమాట వెనుక చనువున్నదే తెలుసుకుంటే మనసు పిలుపున్నదే కళ్లుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే ముసుగే లేకుంటే మనసే జగాన వెలుగై నిలిచి ఉంటుందే ॥ చరణం : 2 నిన్న నేడు రేపు ఒక నిచ్చెన సిరిసిరి మువ్వ గడసరి గువ్వ మనకు మనకు చెలిమే ఒక వంతెన సొగసుల మువ్వా ముసిముసి నవ్వా నిన్న నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమే ఒక వంతెన ఎవరికే వారై ఉంటే ఏముందమ్మా మురళి కాని వెదురై పోదా జన్మ చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయీ జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయమరాఠీ ॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment