Sunday, July 19, 2020

Murari » Alanaati Raama      మురారి » అలనాటి రామ

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Alanaati Raama / అలనాటి రామ

Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,  Sandhya / సంధ్య ,  Sunitha / సునీత ,Song Category : Inspiring & Motivational Songs
alanaaTi raama caMdruDikanniMTaa saaTi
aa palanaaTI baala caMdruDi kannaa anniMTa mETi
alanaaTi raama caMdruDikanniMTaa saaTi
aa palanaaTI baala caMdruDi kannaa anniMTa mETi
anipiMcE arudaina abbaayiki manuvaMDI...aa..aa..aa



telugiMTi paalasaMdramu kanipeMcina kUna
shrIhari iMTi dIpamallE kanipiMcina jaaNa
telugiMTi paalasaMdramu kanipeMcina kUna
shrIhari iMTi dIpamallE kanipiMcina jaaNa
aTuvaMTi aparaMji ammaayini kanaraMDI..aa..aa..aa



caMdamaamaa caMdamaamaa kiMdiki cUDammaa
I nElamIdi nelaraajuni cUsI nivverabOvammaa
vennElammaa vennElammaa vannelu caalammaa
maa annulaminnaku sarigaa lEvani vela vela bOvammaa



puttaDi bommaku pustelu kaDutU puruShuDi munivELLu
paccani meDapai veccaga raasenu cilipi rahasyaalu 
nElaku jaarina taarakalai mutyaala talaMbraalu
iddari talapunu muddaga taDipenu tuMTari jalakaalu
aMdaala jaMTa aMdari kaMTiki viMdulu cEsE samayaana
kaLa kaLa jaMTanu padimaMdi cUDaMdi
taLa taLa merisina aanaMdapu taDi cUpula akShiMtalEyaMDi



sItaaraamula kaLyaaNaMlaa kanipistU unnaa
viragalEdu aa shivuni villu I peLLi maMDapaanaa
gauri shaMkarulEkamaina sumuhUrtamallE unnaa
maragalEdu manmathuni oLLu I callani samayaanaa
dEvuLLa peLLi vEDukalainaa iMta GanaMgaa jarigEnaa
anukoni kanivini erugani peLLiki janamaMtaa raaraMDi
tadupari vivaramulaDagaka baMduvulaMtaa kadalaMDi



caMdamaamaa caMdamaamaa kiMdiki cUDammaa
I nElamIdi nelaraajuni cUsI nivverabOvammaa
vennElammaa vennElammaa vannelu caalammaa
maa annulaminnaku sarigaa lEvani vela vela bOvammaa



Click here to hear the song
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ...ఆ..ఆ..ఆ



తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ..ఆ..ఆ..ఆ



చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా



పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు 
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కళ కళ జంటను పదిమంది చూడంది
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి



సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి వివరములడగక బందువులంతా కదలండి



చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment