Song » Daredumdadum / దరెధమ్దధమ్
Song Details:Actor :
Varun tej / వరుణ్ తేజ్ ,Actress :
Pooja Hegde / పూజా హెగ్డే ,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Mickey J Mayor / మిక్కీ జె. మేయర్ ,Song Category : Inspiring & Motivational Songs
సాకీ : దరెధమ్దధమ్ దరెధమ్దధమ్ (3) దరెధమ్దరెధమ్ధమ్ ''దరెధమ్దధమ్'' పల్లవి : యుగాలన్నీ రానీ పోనీ ముగింపంటూ లేనే లేనీ కథే మనం కాదా అననీ సమీపాన ఉన్నా గానీ కదల్లేని ఈ దూరాన్నీ మరో అడుగు ముందుకు రానీ నిను నను జత కలిపితే గాని తన పని పూర్తవదనుకోని మన వెనుకనే తరుముతూ రాని ఈ క్షణాన్ని గడిచిన ప్రతిజన్మ రుణాన్ని మరిచిన మది నిదరని కరిగించే నిజం ఇదేననీ మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడనీ ''దరెధమ్దధమ్'' చరణం : 1 ప్రతి మలుపూ దారి చూపదా గంగా సాగర సంగమానికి ప్రతి చినుకు వంతెనేయనా నింగి నేలను కలపడానికి ఏ కాలం ఆపింది ఆ కలయికనీ ప్రణయమెపుడు అడిగింది ఎటువుంది తన తీరం అని ఎపుడెదురవుతుంది తాననీ ''దరెధమ్దధమ్'' చరణం : 2 ఈ స్వప్నం తనకి సొంతమో చూపించాలా కంటిపాపకి ఏ స్నేహం తనకి చైత్రమో వివరించాలా పూలతోటకి వేరెవరో చెప్పాలా తన మనసిదనీ కానీ ఎవరినడగాలి తానెవ్వరి గుండెల గూటిలో ఊపిరిగా కొలువుండాలనీ ॥దరెధమ్దధమ్॥
0 comments:
Post a Comment