Monday, July 20, 2020

Mukunda » Chesededo Chesemunde      ముకుంద » చేసేదేదో చేసేముందే

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Chesededo Chesemunde / చేసేదేదో చేసేముందే

Song Details:Actor : Varun tej / వరుణ్ తేజ్  ,Actress : N/A / వర్తించదు ,Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Raahul Nambiar / రాహుల్ నంబియార్  ,  Revanth / రేవంత్ ,Song Category : Inspiring & Motivational Songs
cEsEdEdO cEsEmuMdE
alOchistE tappuMdaa 
tOciMdEdO chEsEstuMTE
toMdarapaaTE ... kaadaa
aachi tUchi aDugeyyoddaa
 
ItE teliyaali - nadi eduraitE
pUrtayi tIraali - katha modaleDitE
gelupE poMdaali - taguvuki digitE
paDinaa lEvaali
E pUTainaa E cOTainaa
nilavani payanaM saagaali
raaLLE vunnaa muLLE unnaa
daarEdainaa gaanI
kOrE gamyaM cUpiMcaali
pakka pakkanE akSHaraalanu nilipi vuMcinaa
ardhamuMDadu O padamu kaanidE
ardhamuMDunaa
(pakka pakkanE akSHaraalanu nilipi vuMcinaa
ardhamavani O padamu kaanidE phalitamuMDunaa)
(I braakeTs lO saahityamE karekT .
ilAgE paaDukOvaali)
nIdi ayina nirvacanamiccukO
jIvitaaniki - EM cEsinaa ...
 
spaSHTaMgaa pOlcukO
SaktuMdaa tElcukO
ati suluvugaa ayyE panaa Emanukunnaa ... OhO ..
kaSHTaalE OrchukO
iSHTaM gaa maarchukO
aDugaDugunaa E malupelA paDagoDutunnaa .. ohO ..
kalalaki, kaLLaki madhyana kanu reppE aDDanI
nammakaM nijamayE lOpugaa
tappani noppi vuMdanI
aakalE vETa gaa maarcaDaM
kaalaM alavaaTanI
gamaniMcE telivE vuMTE
praLayaannE praNayaM anavaa // pakka pakkanE //
 
SrIraamuni baaNamai
saadhiMcina SauryamE
CEdiMcadaa nI lakSHyamu
yamuDedurainaa ... OhO ..
kRSHNuni saaradhyamE
saagina saamardhyamE
saadhiMcadaa Ganavijayamu
prati samaraanaa ... OhO ...
kayyamO neyyamO ceyyaku kaalakSHEpaaniki
gaalilO kattulE duyyaku - Satruvu lEni daaDiki
UhatO niccenE veyyaku - aMdani gaganaaniki
vyardhaM gaa vadilEstE vaMdELLu eMduku manaki
// pakka pakkanE //
చేసేదేదో చేసేముందే
అలోచిస్తే తప్పుందా 
తోచిందేదో చేసేస్తుంటే
తొందరపాటే ... కాదా
ఆచి తూచి అడుగెయ్యొద్దా
 
ఈతే తెలియాలి - నది ఎదురైతే
పూర్తయి తీరాలి - కథ మొదలెడితే
గెలుపే పొందాలి - తగువుకి దిగితే
పడినా లేవాలి
ఏ పూటైనా ఏ చోటైనా
నిలవని పయనం సాగాలి
రాళ్ళే వున్నా ముళ్ళే ఉన్నా
దారేదైనా గానీ
కోరే గమ్యం చూపించాలి
పక్క పక్కనే అక్షరాలను నిలిపి వుంచినా
అర్ధముండదు ఓ పదము కానిదే
అర్ధముండునా
(పక్క పక్కనే అక్షరాలను నిలిపి వుంచినా
అర్ధమవని ఓ పదము కానిదే ఫలితముండునా)
(ఈ బ్రాకెట్స్ లో సాహిత్యమే కరెక్ట్ .
ఇలాగే పాడుకోవాలి)
నీది అయిన నిర్వచనమిచ్చుకో
జీవితానికి - ఏం చేసినా ...
 
స్పష్టంగా పోల్చుకో
శక్తుందా తేల్చుకో
అతి సులువుగా అయ్యే పనా ఏమనుకున్నా ... ఓహో ..
కష్టాలే ఓర్చుకో
ఇష్టం గా మార్చుకో
అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా .. ఒహో ..
కలలకి, కళ్ళకి మధ్యన కను రెప్పే అడ్డనీ
నమ్మకం నిజమయే లోపుగా
తప్పని నొప్పి వుందనీ
ఆకలే వేట గా మార్చడం
కాలం అలవాటనీ
గమనించే తెలివే వుంటే
ప్రళయాన్నే ప్రణయం అనవా // పక్క పక్కనే //
 
శ్రీరాముని బాణమై
సాధించిన శౌర్యమే
ఛేదించదా నీ లక్ష్యము
యముడెదురైనా ... ఓహో ..
కృష్ణుని సారధ్యమే
సాగిన సామర్ధ్యమే
సాధించదా ఘనవిజయము
ప్రతి సమరానా ... ఓహో ...
కయ్యమో నెయ్యమో చెయ్యకు కాలక్షేపానికి
గాలిలో కత్తులే దుయ్యకు - శత్రువు లేని దాడికి
ఊహతో నిచ్చెనే వెయ్యకు - అందని గగనానికి
వ్యర్ధం గా వదిలేస్తే వందేళ్ళు ఎందుకు మనకి
// పక్క పక్కనే //

0 comments:

Post a Comment