Song » Chitapata Chitapata / చిటపట చిటపట
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Rambha / రంభ ,
Ramya krishna / రమ్యకృష్ణ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
ciTapaTa ciTapaTa kalabaDi muddu mIda muddu peTTanaa tarigiTa tarigiTa taLakula buggacUsi laggameTTanaa cilakala ciTTemmaa cidimina siggammaa cinukula shrIraMga vaNukutU vaaTEstaa egabaDi digabaDi magasiri kalabaDi aaligina aMdaalika nIvE padamaMTa ciTapaTa ciTapaTa kalabaDi muddu mIda muddu peTTanaa tarigiTa tarigiTa taLakula buggacUsi laggameTTanaa nI jaMTa jaMpaalaa tanuvulu kalabaDi tapanalu mudaraganE nI cUpuliyyaala pedavula erupula tolakari cilikenulE telimabbO celi navvO cali gilakalatO palikenulE giligiligaa harivillO kanucUpO taDi merupulatO taDimenulE calicaligaa mecci melipeDataa gicci gilipeDataa pacci paDucula valapula cilakalaa pilapila palukula buDibuDi kulukula buDibuDi naDakalu veMTaaDu vELallO ciTapaTa ciTapaTa kalabaDi muddu mIda muddu peTTanaa tarigiTa tarigiTa taLakula buggacUsi laggameTTanaa naa malle mariyaada maDicina sogasula viDicina GaDiyalalO nI kanne siri mIda cilakala palukula alikiDi taLukulalO pasimogga kasibugga cali ceDugulalO ceri sagamai aDigenulE adi prEmO mari EmO yama gilagilagaa salasalagaa tolicenulE cEta cEpaDataa ceMgu muDipeDataa ceMpa taLukulu kalisina merupulu dulipina oDupuna taDimina sogasula toDimala toNikina aMdaala vETallO ciTapaTa ciTapaTa kalabaDi muddu mIda muddu peTTanaa tarigiTa tarigiTa taLakula buggacUsi laggameTTanaa cilakala ciTTemmaa cidimina siggammaa cinukula shrIraMga vaNukutU vaaTEstaa egabaDi digabaDi magasiri kalabaDi aaligina aMdaalika nIvE padamaMTa ciTapaTa ciTapaTa kalabaDi muddu mIda muddu peTTanaa tarigiTa tarigiTa taLakula buggacUsi laggameTTanaa Click here to hear the song
చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా చిలకల చిట్టెమ్మా చిదిమిన సిగ్గమ్మా చినుకుల శ్రీరంగ వణుకుతూ వాటేస్తా ఎగబడి దిగబడి మగసిరి కలబడి ఆలిగిన అందాలిక నీవే పదమంట చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా నీ జంట జంపాలా తనువులు కలబడి తపనలు ముదరగనే నీ చూపులియ్యాల పెదవుల ఎరుపుల తొలకరి చిలికెనులే తెలిమబ్బో చెలి నవ్వో చలి గిలకలతో పలికెనులే గిలిగిలిగా హరివిల్లో కనుచూపో తడి మెరుపులతో తడిమెనులే చలిచలిగా మెచ్చి మెలిపెడతా గిచ్చి గిలిపెడతా పచ్చి పడుచుల వలపుల చిలకలా పిలపిల పలుకుల బుడిబుడి కులుకుల బుడిబుడి నడకలు వెంటాడు వేళల్లో చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా నా మల్లె మరియాద మడిచిన సొగసుల విడిచిన ఘడియలలో నీ కన్నె సిరి మీద చిలకల పలుకుల అలికిడి తళుకులలో పసిమొగ్గ కసిబుగ్గ చలి చెడుగులలో చెరి సగమై అడిగెనులే అది ప్రేమో మరి ఏమో యమ గిలగిలగా సలసలగా తొలిచెనులే చేత చేపడతా చెంగు ముడిపెడతా చెంప తళుకులు కలిసిన మెరుపులు దులిపిన ఒడుపున తడిమిన సొగసుల తొడిమల తొణికిన అందాల వేటల్లో చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా చిలకల చిట్టెమ్మా చిదిమిన సిగ్గమ్మా చినుకుల శ్రీరంగ వణుకుతూ వాటేస్తా ఎగబడి దిగబడి మగసిరి కలబడి ఆలిగిన అందాలిక నీవే పదమంట చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment