Song » Lipi leni kanti baasa / లిపి లేని కంటి బాస
Song Details:Actor :
Pradeep / ప్రదీప్ ,Actress :
Purnima / పూర్ణిమ ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
lipi lEni kaMTi bAsa telipiMdi cilipi ASa nI kannula kATuka lEKalalO nI sogasula kavitA rEKalalO ilA ilA cadavanI nI lEKani praNaya lEKani badulaina lEni lEKa bratukaina prEmalEKa nI kaugiTa bigisina SvAsalatO nI kavitalu nErpina prAsalatO ilA ilA rAyanI nA lEKani praNaya rEKani lipi lEni kaMTi bAsa telipiMdi cilipi ASa caraNaM1: amAvAsya niSilO kOTi tAralunna AkASaM vedukutu uMdi vEdana tAnai vidiya nATi jAbili kOsaM velugunIDalennunnA velagalEni AkASaM lala A A lala A A A A A A tanana tanana tanana tanana edugutu uMdi vennela tAnai okkanATi punnami kOsaM lipi lEni kaMTi bAsa telipiMdi cilipi ASa caraNaM2: akSharAla nIDalalO nI jADalu cUsukuni A padAla allikalO nI pedavulu addukuni nI kaMTiki pApanu nEnai nI iMTiki vAkili nEnai gaDapa dATalEka nannE gaDiya vEsukunnAnu GaDiyainA nIvu lEka gaDapalEka unnAnu badulaina lEni lEKa bratukaina prEmalEKa nI kaugiTa bigisina SvAsalatO nI kavitalu nErpina prAsalatO ilA ilA rAyanI nI lEKani praNaya lEKani lipi lEni kaMTi bAsa telipiMdi cilipi ASa
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ నీ కన్నుల కాటుక లేఖలలో నీ సొగసుల కవితా రేఖలలో ఇలా ఇలా చదవనీ నీ లేఖని ప్రణయ లేఖని బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ చరణం1: అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం వెదుకుతు ఉంది వేదన తానై విదియ నాటి జాబిలి కోసం వెలుగునీడలెన్నున్నా వెలగలేని ఆకాశం లల ఆ ఆ లల ఆ ఆ ఆ ఆ ఆ ఆ తనన తనన తనన తనన ఎదుగుతు ఉంది వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ చరణం2: అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను ఘడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయనీ నీ లేఖని ప్రణయ లేఖని లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
0 comments:
Post a Comment