Song » Sogasu chooda tharama / సొగసు చూడ తరమా..
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Aamani / ఆమని ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
pallavi: sogasu cUDa taramA.. sogasu cUDa taramA A A nI sogasu cUDa taramA A A nI sogasu cUDa taramA A A nI ApasOpAlu nI tIpiSApAlu erranni kOpAlu ennennO dIpAlu a0damE sumA sogasu cUDa tarAmA ... nI sogasu cUDa taramA A A caraNaM 1: arugu mIda nilabaDi ..nI kurulanu duvvE vELa cEjArina duvvennaku bEjAruga va0ginapuDu cirukOpa0 cIrakaTTi siggunu ce0guna dAci Pakkumanna cakkadana0 parugO parugettinapuDu A sogasu cUDa taramA .. nI sogasu cUDa taramA ... A A !! caraNaM 2: peTTI peTTani muddunu .. iTTE vidili0cikoTTi gummettE sOyagAna gummAlanu dATuvELa ce0gupaTTu paTTi rArammani celagATaku digutu0TE taDibArina kannulato viDuviDuma0TunnapuDu viDuviDuma0TunnapuDu A sogasu cUDa taramA.. nI sogasu cUDataramA A.. A!!! pasipApaku pAlistu paravaSi0ci unnapuDu pedapApaDu pAkivacci.. mari nAkO annapuDu moTTikAya vEsi.. Ci po0Di. annapuDu.. nA EDupU nI navvulU.. harivillayi velasinapuDu A sogasu cUDa taramA. nI sogasu cUDa taramA A A!!! caraNaM 3: sirimallelu harivillapu jaDalOturimi.. kShaNamE..yugamai vEci vEci calipo0gunu celikOkala muDilO adimi .. alisI solasI kannuluvAcI niTTUrpula niSirAtrilO nidarOvu aMdAlatO tyAgarAja kRutilO sItAkRuti gala iTuva0Ti sogasucUDataramA nI sogasu cUDa taramA A A ...!!!!
పల్లవి: సొగసు చూడ తరమా.. సొగసు చూడ తరమా ఆ ఆ నీ సొగసు చూడ తరమా ఆ ఆ నీ సొగసు చూడ తరమా ఆ ఆ నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అ౦దమే సుమా సొగసు చూడ తరామా ... నీ సొగసు చూడ తరమా ఆ ఆ చరణం 1: అరుగు మీద నిలబడి ..నీ కురులను దువ్వే వేళ చేజారిన దువ్వెన్నకు బేజారుగ వ౦గినపుడు చిరుకోప౦ చీరకట్టి సిగ్గును చె౦గున దాచి ఫక్కుమన్న చక్కదన౦ పరుగో పరుగెత్తినపుడు ఆ సొగసు చూడ తరమా .. నీ సొగసు చూడ తరమా ... ఆ ఆ !! చరణం 2: పెట్టీ పెట్టని ముద్దును .. ఇట్టే విదిలి౦చికొట్టి గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటువేళ చె౦గుపట్టు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతు౦టే తడిబారిన కన్నులతొ విడువిడుమ౦టున్నపుడు విడువిడుమ౦టున్నపుడు ఆ సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడతరమా ఆ.. ఆ!!! పసిపాపకు పాలిస్తు పరవశి౦చి ఉన్నపుడు పెదపాపడు పాకివచ్చి.. మరి నాకో అన్నపుడు మొట్టికాయ వేసి.. ఛి పొ౦డి. అన్నపుడు.. నా ఏడుపూ నీ నవ్వులూ.. హరివిల్లయి వెలసినపుడు ఆ సొగసు చూడ తరమా. నీ సొగసు చూడ తరమా ఆ ఆ!!! చరణం 3: సిరిమల్లెలు హరివిల్లపు జడలోతురిమి.. క్షణమే..యుగమై వేచి వేచి చలిపొ౦గును చెలికోకల ముడిలో అదిమి .. అలిసీ సొలసీ కన్నులువాచీ నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవు అందాలతో త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువ౦టి సొగసుచూడతరమా నీ సొగసు చూడ తరమా ఆ ఆ ...!!!!
0 comments:
Post a Comment