Friday, July 10, 2020

Mooga manasulu » Gowramma      మూగమనసులు » గౌరమ్మా

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Gowramma / గౌరమ్మా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
gOpi:gaurammA nI moguDevarammA ?
     evarammA, vADevarammA                 ||gaurammA||
gauri:    SeppAlaMTE siggu kadayyA ..
gOpi:    A^ ..
gauri:    AnavALLu nE sebutAnayyA
maga kOras:    seppu seppU
gauri:    sigalO nelavaMka, meDalO nAgarAju
    A rEDu nAvADu sarirAru vErevaru
    mAvayyA nA moguDevarayyA ? vErevarayyA?
ADa kOras:     mAvayyA nA moguDevarayyA ?
gOpi:    illu vAkili lEnivADu _ lE..nI..vA...Du
maga kOras:      lEnivADu
gOpi:    biccamettukoni tirigEvADu .. mAdAkOLaM
maga kOras:    illu vAkili lEnivADu _ biccamettukoni tirigEvADu
gOpi:    eguDUdiguDu kannulavADu jaMgaMdEvara nI vADA        ||gaurammA||
gauri:    AkASamE illu _ lOkamE vAkilI ..
ADa kOras:    avunu
gauri:    biccamaDigEdi Bakti .. badulu iccEdi mukti
ADa kOras:    biccamaDigEdi Bakti badulu iccEdi mukti
gauri:    bEsikannulE lEkuMTEnu beMbElettunu mullOkAlu
    mAvayyA nA moguDevarayyA ? evarayyA? vErevarayyA?
ADa kOras: mAvayyA nA moguDevarayyA ?
gOpi:    moguDu moguDani muriSAvE _ kulikAvE, pogiDAvE... pillOy^
    nettini evarino ettukoni nitteM dAnine kolusunaTa
    adiyE Atani AliyaTa kOtalu, kOtalu eMduku kOstAvE ?
maga kOras: kOtalu eMduku kO...stA... vE    
gOpi:    gaurammA nI moguDevarammA ?
     evarammA, vADevarammA
gauri:    evarO piliste vacciMdi, evarikOsamO pOtOMdi, mayAnna majilI yEsiMdi
ADa kOras: mayAnna majilI yEsiMdi
gauri:    sagaM dEhamai nEnuMTE, adi peLLAmaMTE selladulE
    paLLu padArU rAlunulE ..
 ADa kOras:    paLLu padArU rAlunulE
gauri:    mAvayyO nA moguDevarayyA? evarayyA? vErevarayyA?
ADa kOras: mAvayyO nA moguDevarayyA?
 
 
Click here to hear the song
గోపి: గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ?
     ఎవరమ్మా, వాడెవరమ్మా                 ||గౌరమ్మా||
గౌరి:    శెప్పాలంటే సిగ్గు కదయ్యా ..
గోపి:    ఆ‍ ..
గౌరి:    ఆనవాళ్ళు నే సెబుతానయ్యా
మగ కోరస్:    సెప్పు సెప్పూ
గౌరి:    సిగలో నెలవంక, మెడలో నాగరాజు
    ఆ రేడు నావాడు సరిరారు వేరెవరు
    మావయ్యా నా మొగుడెవరయ్యా ? వేరెవరయ్యా?
ఆడ కోరస్:     మావయ్యా నా మొగుడెవరయ్యా ?
గోపి:    ఇల్లు వాకిలి లేనివాడు _ లే..నీ..వా...డు
మగ కోరస్:      లేనివాడు
గోపి:    బిచ్చమెత్తుకొని తిరిగేవాడు .. మాదాకోళం
మగ కోరస్:    ఇల్లు వాకిలి లేనివాడు _ బిచ్చమెత్తుకొని తిరిగేవాడు
గోపి:    ఎగుడూదిగుడు కన్నులవాడు జంగందేవర నీ వాడా        ||గౌరమ్మా||
గౌరి:    ఆకాశమే ఇల్లు _ లోకమే వాకిలీ ..
ఆడ కోరస్:    అవును
గౌరి:    బిచ్చమడిగేది భక్తి .. బదులు ఇచ్చేది ముక్తి
ఆడ కోరస్:    బిచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి
గౌరి:    బేసికన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు
    మావయ్యా నా మొగుడెవరయ్యా ? ఎవరయ్యా? వేరెవరయ్యా?
ఆడ కోరస్: మావయ్యా నా మొగుడెవరయ్యా ?
గోపి:    మొగుడు మొగుడని మురిశావే _ కులికావే, పొగిడావే... పిల్లోయ్‍
    నెత్తిని ఎవరినొ ఎత్తుకొని నిత్తెం దానినె కొలుసునట
    అదియే ఆతని ఆలియట కోతలు, కోతలు ఎందుకు కోస్తావే ?
మగ కోరస్: కోతలు ఎందుకు కో...స్తా... వే    
గోపి:    గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ?
     ఎవరమ్మా, వాడెవరమ్మా
గౌరి:    ఎవరో పిలిస్తె వచ్చింది, ఎవరికోసమో పోతోంది, మయాన్న మజిలీ యేసింది
ఆడ కోరస్: మయాన్న మజిలీ యేసింది
గౌరి:    సగం దేహమై నేనుంటే, అది పెళ్ళామంటే సెల్లదులే
    పళ్ళు పదారూ రాలునులే ..
 ఆడ కోరస్:    పళ్ళు పదారూ రాలునులే
గౌరి:    మావయ్యో నా మొగుడెవరయ్యా? ఎవరయ్యా? వేరెవరయ్యా?
ఆడ కోరస్: మావయ్యో నా మొగుడెవరయ్యా?
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment