Monday, July 13, 2020

Mirchi » Katuka kallanu cheste      మిర్చి » కాటుక కళ్ళను చూస్తే

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Katuka kallanu cheste / కాటుక కళ్ళను చూస్తే
Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Anitha / అనిత ,  Vijay Prakash / విజయ్ ప్రకాశ్ ,Song Category : Love & Romantic Songs
kATuka kaLLanu cUstE pOtuMdE mati pOtuMdE
cATuga naDumunu cUstE pOtuMdE mati pOtuMdE
GATuga pedavulu cUstE pOtuMdE mati pOtuMdE
rATuga sogasulu cUstE pOtuMdE mati pOtuMdE
lETugu iMtaMdAnni cUsAnE anipistuMdE
nA manasE nIvaipostuMTE
idEdO bAguMdE celi idEnA prEmaMTE mari
idEdO bAguMdE celi idEnA prEmaMTE mari
nI mati pOgoDutuMTe nAkeMtO saradAguMdE
ASalu rEpEDutuMTE nAkeMtO saradAguMdE
ninnilA  allADistE nAkeMtO saradAguMdE
aMdaMgA nOrUristE nAkeMtO saradAguMdE
nI kaShTaM cUstU  aMdaM ayyayyo anukuMTunE
ilAgE iMkAsEpaMTuMTE
idEdO bAguMdE mari idE prEmanukuMTE sari
idEdO bAguMdE mari idE prEmanukuMTE sari
 
 
telusukuMTAvA telupamaMTAvA 
manasu aMcullO niMcunna nA kalani
eduru cUstunna eduTanE unna
badulu dorikETTu palikiMcu nI svarAnni
vEla goMtullOna mOgiMdE maunaM
nuvvunna cOTE nEnani
cUsi cuDaMgAnE ceppiMdE prANaM
nEnnIdAnnai pOyAnani
idEdI bAguMdE celi idEnA prEmaMTE mari
idEdIbAguMdE mari idE prEmanukuMTE sari
 
taraci cUstUnE taragadaMTunna
taLuku varNAla nI mEnu pUlaganI
naligipotunE veligipotunna
tanivi tIrETTu saMdhiMcu cUpulanni
kaMTi reppalu reMDu pedavullA mAri
ninnE tinEstAmannAyE
nEdO rEpO adi tappadugA mari
nIkOsaM edainA sarE
idEdO bAguMdE celi idEnA prEmaMTE mari
idEdO bAguMdE mari idE prEmanukuMTE sari
కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే
ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే
రాటుగ సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే
లేటుగు ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే
నా మనసే నీవైపొస్తుంటే
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
నీ మతి పోగొడుతుంటె నాకెంతో సరదాగుందే
ఆశలు రేపేడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిలా  అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ  అందం అయ్యయ్యొ అనుకుంటునే
ఇలాగే ఇంకాసేపంటుంటే
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
 
 
 తెలుసుకుంటావా తెలుపమంటావా 
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్న ఎదుటనే ఉన్న
బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం
నువ్వున్న చోటే నేనని
చూసి చుడంగానే చెప్పిందే ప్రాణం
నేన్నీదాన్నై పోయానని
ఇదేదీ బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదీబాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
 
తరచి చూస్తూనే తరగదంటున్న
తళుకు వర్ణాల నీ మేను పూలగనీ
నలిగిపొతునే వెలిగిపొతున్న
తనివి తీరేట్టు సంధించు చూపులన్ని
కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి
నిన్నే తినేస్తామన్నాయే
నేదో రేపో అది తప్పదుగా మరి
నీకోసం ఎదైనా సరే
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

0 comments:

Post a Comment