Song » Sree Rama Naamaalu / శ్రీరామ నమాలు శతకోటి
Song Details:Actor :
N/A / వర్తించదు ,Actress :
Chandrakala / చంద్రకళ ,
Vijayanirmala / విజయనిర్మల ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Devotional Songs
Sreeraama naamaalu SatakOTi okkokka paeru bahuteepi - bahuteepi Sreeraama taMDri aanati taladaalchu tanayuDu daSaratha raamuDu stavaneeyuDu kaDu maeTi vilu virichi kalikini chaepaTTu kaLyaaNa raamayya kamaneeyuDu ... kamaneeyuDu Sreeraama sudati jaanaki tODa Subha sarasamaaDaeTi suMdara raamayya sukumaaruDu sudati kOti mookalato .... kOti mookalato laMkapai daMDettu kOdaMDa raamayya raNadheeruDu - raNadheeruDu Sreeraama pavamaana sutuDu paadaalu paTTagaa paTTaabhi raamayya paraMdhaamuDu pavamaana avanilO saeviMchu aaSritula paaliMchu achyuta raamayya akhilaatmuDu - akhilaatmuDu Sreeraama Click here for the song youtu.be/1ItouLFcLXE
శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి - బహుతీపి ॥ శ్రీరామ ॥ తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రాముడు స్తవనీయుడు కడు మేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణ రామయ్య కమనీయుడు ... కమనీయుడు ॥ శ్రీరామ ॥ సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు ॥సుదతి ॥ కోతి మూకలతొ .... కోతి మూకలతొ లంకపై దండెత్తు కోదండ రామయ్య రణధీరుడు - రణధీరుడు ॥ శ్రీరామ ॥ పవమాన సుతుడు పాదాలు పట్టగా పట్టాభి రామయ్య పరంధాముడు ॥పవమాన ॥ అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుత రామయ్య అఖిలాత్ముడు - అఖిలాత్ముడు ॥ శ్రీరామ ॥ పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి youtu.be/1ItouLFcLXE
0 comments:
Post a Comment