Song » Gowri sankara / గౌరీ శంకర
Song Details:Actor :Actress :
Sudhachandran / సుధాచంద్రన్ ,Music Director :
S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pa:gaurI SaMkara SRuMgaM naranArI saMgama raMgaM idi naTanaku sOpAnaM kaLalaku kaLyANaM ||gaurI SaMkara|| ca: pAdapUjakai maMdAramainA nAda madhuvutO maMjIramAye dEvatArcanaku EkIrtanainA jIvitAMtami rasa nartanAye vAjjayamE vacanaM AMgikamE BuvanaM ||vAjjayamE|| AkASAlalO tAralanni AhAryAlugA aMdukuMTU kailAsAla SiKarAgrAlaMdu kaivalyAlu cavicUsE vELalO ||gaurI SaMkara|| ca: paDamaTeMDala pArANi tUle saMdhyArAgAlatO UsulADe kolanulu nidarOvu kArtIka vELa kaluvalalO tEne giligiMtalAye sakala kaLA SiKaraM nartanamE madhuraM ||sakalakaLA|| kASmIrAlalO pUla gaMdhaM kEdArAlalO sasyagItaM SivalAsyAla SRuMgArAlennO aMgAMgAla virabUsE vELalO ||gaurI SaMkara||
ప: గౌరీ శంకర శృంగం నరనారీ సంగమ రంగం ఇది నటనకు సోపానం కళలకు కళ్యాణం ||గౌరీ శంకర|| చ: పాదపూజకై మందారమైనా నాద మధువుతో మంజీరమాయె దేవతార్చనకు ఏకీర్తనైనా జీవితాంతమి రస నర్తనాయె వాజ్జయమే వచనం ఆంగికమే భువనం ||వాజ్జయమే|| ఆకాశాలలో తారలన్ని ఆహార్యాలుగా అందుకుంటూ కైలాసాల శిఖరాగ్రాలందు కైవల్యాలు చవిచూసే వేళలో ||గౌరీ శంకర|| చ: పడమటెండల పారాణి తూలె సంధ్యారాగాలతో ఊసులాడె కొలనులు నిదరోవు కార్తీక వేళ కలువలలో తేనె గిలిగింతలాయె సకల కళా శిఖరం నర్తనమే మధురం ||సకలకళా|| కాశ్మీరాలలో పూల గంధం కేదారాలలో సస్యగీతం శివలాస్యాల శృంగారాలెన్నో అంగాంగాల విరబూసే వేళలో ||గౌరీ శంకర||
0 comments:
Post a Comment