Wednesday, July 29, 2020

Mayuri » Ennello mutyamaa      మయూరి » ఎన్నెల్లో ముత్యమా

July 29, 2020 Posted by Publisher , No comments

Song » Ennello mutyamaa / ఎన్నెల్లో ముత్యమా
Song Details:Actor :Actress : Sudhachandran / సుధాచంద్రన్  ,Music Director : S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
bRuMdaM:   ennellO mutyamA eMDallO padmamA
    cIkaTlO dIpamA sirikE pratirUpamA
    E pErO E UrO ceppavammA
    telugiMTi kalikaMTi tEnelamma
    ceppavammA tEnelammA.... ceppavammA tEnelammA
a :     mahAkavi gurajADa  mAnasa putrikavu  nIvu
    puttaDibommavA  pUrNammavA!
A:    nA kannulu kaluvala rEkalani
    nA aDugulu haMsala rAkalani
    nA palukulu tEnela vAkalani
    telisi telisi eMta vagacinA
    tAtatOne muDipeTTAru
    tALitOne uritISAru
    ammallArA akkallArA AkASaMlO O cukkallArA
    nelakokasAri vastU unnA niMDuga punnaminai
    mIlOnE jIvistunnA
     puttaDibomma pUrNammanai.... puttaDibomma pUrNammanai
a:     viSvanAdhuni cEta tolinATi kavitavai
    viritEniyalu poMgu selayETi vanitavai
    velugoMdu telugu jilugula rANivi
    avunu! kinnerasAnivi
A:     toluta nA kannIru kAlvalai pAriMdi
    pidapa adi vAgulai vaMkalai poMgiMdi
    taragalai nurugulai taragalE paDagalai
    paDagalE aDugulai aDugulE maDugulai
    parugulettina   dAnini  nEnu   paruvAla dorasAnini
    koDuku daSanE  dATimagaDu kAlEni
    oka paDucuvADiki
    tagani gaDusu illAlini
    nEnu kinnerasAnini
    peLLaina telugu kannela sATini
    nEnu kinnerasAnini peLLaina telugu kannela sATini
a:    evvareruganidamma naMDUri eMkI
    pUvulA navvETi telugu pUbaMtI
A:     kaDavAkaina lEdu toDimaMta eDamu
    eDameTTA guMTAdi piDikeDE naDumu ||kaDavAkaina||
    mabbuteranE  viDice vaMka jAbilli
    ubbarAla raikalebbebbarilli
bRuMdaM: abbalAlO....Emi nibbarAlO
A:      jArupaiTE cAlu jAvaLIpATa
bRuMdaM: lA   lA la la lA lA lA
A:     nAyiDOri jANA naDicETi vINA
    vennu taDitE cAlu vennellu karugu
    gOvu podugullOnA gOdAri poMgu
    ennelammani ciliki EDu mallela kodigi
    telugiMTapuTTiMdi elugaMTi eMki
    telugallE edigiMdi cilakaMTi eMki
    elugaMTi eMki cilakaMTi eMki
bRuMdaM: elugaMTi eMki cilakaMTi eMki    || elugaMTi  ||
బృందం: ఎన్నెల్లో ముత్యమా ఎండల్లో పద్మమా
    చీకట్లో దీపమా సిరికే ప్రతిరూపమా
    ఏ పేరో ఏ ఊరో చెప్పవమ్మా
    తెలుగింటి కలికంటి తేనెలమ్మ
    చెప్పవమ్మా తేనెలమ్మా.... చెప్పవమ్మా తేనెలమ్మా
అ :     మహాకవి గురజాడ  మానస పుత్రికవు  నీవు
    పుత్తడిబొమ్మవా  పూర్ణమ్మవా!
ఆ:    నా కన్నులు కలువల రేకలని
    నా అడుగులు హంసల రాకలని
    నా పలుకులు తేనెల వాకలని
    తెలిసి తెలిసి ఎంత వగచినా
    తాతతోనె ముడిపెట్టారు
    తాళితోనె ఉరితీశారు
    అమ్మల్లారా అక్కల్లారా ఆకాశంలో ఓ చుక్కల్లారా
    నెలకొకసారి వస్తూ ఉన్నా నిండుగ పున్నమినై
    మీలోనే జీవిస్తున్నా
     పుత్తడిబొమ్మ పూర్ణమ్మనై.... పుత్తడిబొమ్మ పూర్ణమ్మనై
అ:     విశ్వనాధుని చేత తొలినాటి కవితవై
    విరితేనియలు పొంగు సెలయేటి వనితవై
    వెలుగొందు తెలుగు జిలుగుల రాణివి
    అవును! కిన్నెరసానివి
ఆ:     తొలుత నా కన్నీరు కాల్వలై పారింది
    పిదప అది వాగులై వంకలై పొంగింది
    తరగలై నురుగులై తరగలే పడగలై
    పడగలే అడుగులై అడుగులే మడుగులై
    పరుగులెత్తిన   దానిని  నేను   పరువాల దొరసానిని
    కొడుకు దశనే  దాటిమగడు కాలేని
    ఒక పడుచువాడికి
    తగని గడుసు ఇల్లాలిని
    నేను కిన్నెరసానిని
    పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని
    నేను కిన్నెరసానిని పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని
అ:    ఎవ్వరెరుగనిదమ్మ నండూరి ఎంకీ
    పూవులా నవ్వేటి తెలుగు పూబంతీ
ఆ:     కడవాకైన లేదు తొడిమంత ఎడము
    ఎడమెట్టా గుంటాది పిడికెడే నడుము ||కడవాకైన||
    మబ్బుతెరనే  విడిచె వంక జాబిల్లి
    ఉబ్బరాల రైకలెబ్బెబ్బరిల్లి
బృందం: అబ్బలాలో....ఏమి నిబ్బరాలో
ఆ:      జారుపైటే చాలు జావళీపాట
బృందం: లా   లా ల ల లా లా లా
ఆ:     నాయిడోరి జాణా నడిచేటి వీణా
    వెన్ను తడితే చాలు వెన్నెల్లు కరుగు
    గోవు పొదుగుల్లోనా గోదారి పొంగు
    ఎన్నెలమ్మని చిలికి ఏడు మల్లెల కొదిగి
    తెలుగింటపుట్టింది ఎలుగంటి ఎంకి
    తెలుగల్లే ఎదిగింది చిలకంటి ఎంకి
    ఎలుగంటి ఎంకి చిలకంటి ఎంకి
బృందం: ఎలుగంటి ఎంకి చిలకంటి ఎంకి    || ఎలుగంటి  ||

0 comments:

Post a Comment