Saturday, July 11, 2020

Mayabazaar » Vinnavamma Yashodamma      మాయాబజార్ » విన్నావ యశోదమ్మా!

July 11, 2020 Posted by Publisher , No comments


Song » Vinnavamma Yashodamma / విన్నావ యశోదమ్మా!
Song Details:Actor : Group Artistes / ఉప పాత్రధారులు  ,  Master Babji / మాస్టర్ బాబ్జి  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Group Artistes / ఉప పాత్రధారులు ,  Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer :Song Category : Others
gOpikalu : vinnAva yaSOdammA! 2
mI cinni kRuShNuDu cEsinaTTi
allari cillari panulu vinnava yaSOdamma
yaSOda : anneM punneM erugani pApaDu
mannutinE nA cinnitanayuDu
Emi cEsenammA eMduku ravva cEturammA.
gOpikalu : A... mannu tinEvADA? venna tinEvADA?
kAligajjela saMdaDi cEyaka
pillivale mA iMTlO dUri kAli
ettuga kaTTina uTTaMdukuni
duttalannI kriMda diMcukuni ettu
pAlannI tAgESanammA.
perugaMtA jArESanammA,
vennaMtA mokkESanammA



kRuShNuDu : okkaTE eTlA tinESanammA? 
kaladammA, idi ekkaDanainA kaladammA?
vinnAvaTammA.... vinnAvaTamma
O yaSOdA! gOpika ramaNula kallalU
I gOpika ramaNula kallalU...
gOpikalu : A... elA bUkaristunnADO!
pOnI paTTiddAmaMTE cikkutADA!
BAmalaMdaroka yuktini panni
gammamu nokaruga kAciyuMDagA
okariMTlO vini gajjela galagala
okariMTlO vini vENugAnamU okariMTlO



AhA: iMkEM
doMga dorikenani pOyicUDagA
CaMguna neTakO dATipOyE
elA vaccenO elA pOyenO
cilipi kRuShNuDanE aDugavammA...elA



kRuShNuDu : nAkEM telusu nEnikkaDa lEMdE!
yaSOda : mari ekkaDunnAvu?
kRuShNuDu : kALiMdi maDuguna viShamunu kalipe
kALiya talapai tAMDavamADi kALiMdi
A viShasarpamu naMtamu jEsi
gOvula callaga kAcanE...3



draupadi: hE kRuShNA... hE kRuShNA....
mukuMdA moravinavA,
nIvu vinA dikkevaru dInurAli ganavA kRuShNA
nA hIna gatini ganavA....kRuShNA kRuShNA kRuShNA....
 
Click here to hear the song
గోపికలు : విన్నావ యశోదమ్మా! 2
మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి
అల్లరి చిల్లరి పనులు విన్నవ యశోదమ్మ
యశోద : అన్నెం పున్నెం ఎరుగని పాపడు
మన్నుతినే నా చిన్నితనయుడు
ఏమి చేసెనమ్మా ఎందుకు రవ్వ చేతురమ్మా.
గోపికలు : ఆ... మన్ను తినేవాడా? వెన్న తినేవాడా?
కాలిగజ్జెల సందడి చేయక
పిల్లివలె మా ఇంట్లో దూరి కాలి
ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని
దుత్తలన్నీ క్రింద దించుకుని ఎత్తు
పాలన్నీ తాగేశనమ్మా.
పెరుగంతా జారేశనమ్మా,
వెన్నంతా మొక్కేశనమ్మా



కృష్ణుడు : ఒక్కటే ఎట్లా తినేశనమ్మా? 
కలదమ్మా, ఇది ఎక్కడనైనా కలదమ్మా?
విన్నావటమ్మా.... విన్నావటమ్మ
ఓ యశోదా! గోపిక రమణుల కల్లలూ
ఈ గోపిక రమణుల కల్లలూ...
గోపికలు : ఆ... ఎలా బూకరిస్తున్నాడో!
పోనీ పట్టిద్దామంటే చిక్కుతాడా!
భామలందరొక యుక్తిని పన్ని
గమ్మము నొకరుగ కాచియుండగా
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణుగానమూ ఒకరింట్లో



ఆహా: ఇంకేం
దొంగ దొరికెనని పోయిచూడగా
ఛంగున నెటకో దాటిపోయే
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణుడనే అడుగవమ్మా...ఎలా



కృష్ణుడు : నాకేం తెలుసు నేనిక్కడ లేందే!
యశోద : మరి ఎక్కడున్నావు?
కృష్ణుడు : కాళింది మడుగున విషమును కలిపె
కాళియ తలపై తాండవమాడి కాళింది
ఆ విషసర్పము నంతము జేసి
గోవుల చల్లగ కాచనే...౩



ద్రౌపది: హే కృష్ణా... హే కృష్ణా....
ముకుందా మొరవినవా,
నీవు వినా దిక్కెవరు దీనురాలి గనవా కృష్ణా
నా హీన గతిని గనవా....కృష్ణా కృష్ణా కృష్ణా....
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment