Friday, July 24, 2020

Mathru Devatha » Vidhi oka vishavalayam      మాతృ దేవత » విధి ఒక విషవలయం

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Vidhi oka vishavalayam / విధి ఒక విషవలయం

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi:  vidhi oka viShavalayaM

viShAda kathalaku adi nilayaM  2

vidhi oka viShavalayaM
caraNaM:

puvvumATuna - poMcina mullu

nATEdAkA teliyadu

kaDali kaDupuna baDabAnalamu

ragilEdAkA teliyadu

paccani taruvu suDigAlipAlai    vidhi oka

virigE dAkA teliyadu
caraNaM:

kalalOnaina eDabATerugani

kulasati eMtagA vagacenO

innELLAyenu nAnna EDani      2

kUtureMtagA vEcenO

guMDe ceruvugA kumilina mAyamma    vidhi oka
caraNaM:

ceTTukokaTigA cedarina guvvalu

civariki gUTiki cErEnA

aMtulEni I aj~jAtavAsaM EnATikainA tIrEnA

mamatalu niMDina mA kApuramE   vidhi oka

maLLI kaLakaLalADEnA...


 
Click here to hear the song
పల్లవి:  విధి ఒక విషవలయం

విషాద కథలకు అది నిలయం  2

విధి ఒక విషవలయం
చరణం:

పువ్వుమాటున - పొంచిన ముల్లు

నాటేదాకా తెలియదు

కడలి కడుపున బడబానలము

రగిలేదాకా తెలియదు

పచ్చని తరువు సుడిగాలిపాలై    విధి ఒక

విరిగే దాకా తెలియదు
చరణం:

కలలోనైన ఎడబాటెరుగని

కులసతి ఎంతగా వగచెనో

ఇన్నేళ్ళాయెను నాన్న ఏడని      2

కూతురెంతగా వేచెనో

గుండె చెరువుగా కుమిలిన మాయమ్మ    విధి ఒక
చరణం:

చెట్టుకొకటిగా చెదరిన గువ్వలు

చివరికి గూటికి చేరేనా

అంతులేని ఈ అజ్ఞాతవాసం ఏనాటికైనా తీరేనా

మమతలు నిండిన మా కాపురమే   విధి ఒక

మళ్ళీ కళకళలాడేనా..
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment