Tuesday, July 21, 2020

Maryaada Raamanna » Parugulu tiye      మర్యాద రామన్న » పరుగులు తీయ్

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Parugulu tiye / పరుగులు తీయ్

Song Details:Actor : Sunil / సునీల్ ,Actress : Saloni / సలోనీ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Club & Item Songs
harOM harOM hara..hara hara hara hara

harOM harOM hara..hara hara hara hara



parugulu tiy..! bira bira bira bira

urakalu vey..! chara chara chara chara

daDa daDa daDa daDalaaDE edasaDi nammakamai Damarukamai

vaDi vaDi vaDi vaDi dUkE padagati taaMDavamai

paMchapraaNamula paMchaakSharitO shivuni piluchu saMkalpamai

muMduku vachche mRutyuvukaMdani maarkaMDEyuDavai

parugulu tiy bira bira bira bira

urakalu vey..! chara chara chara chara



kattuka kOse katti konalu daridaapuku cErani dUkuDuvai

aayuvu tIsE aapada kUDaa alasaTatO aagElaa chey

maTTiloki tana giTTalatO ninu tokkeyyaalani tarumuku vacche

kaalaashwaM pai swaarI cey..



eDaari daarula taDaaripOyina aashaku chemaTala dhaaranu poy..!

nissattuvatO nilabaDa nivvaka okkO aDugunu muMduku vey..!

vaMda ELLa nI niMDu jIvitaM gaMDi paDadanE nammakamai

shatakOTi samasyalanedurkonEMduku batiki uMDagala saahasaanivai..

parugulu tiy bira bira bira bira

urakalu vey..! chara chara chara chara



 
Click here to hear the song
హరోం హరోం హర..హర హర హర హర

హరోం హరోం హర..హర హర హర హర



పరుగులు తియ్..! బిర బిర బిర బిర

ఉరకలు వెయ్..! చర చర చర చర

దడ దడ దడ దడలాడే ఎదసడి నమ్మకమై డమరుకమై

వడి వడి వడి వడి దూకే పదగతి తాండవమై

పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై

ముందుకు వచ్చె మృత్యువుకందని మార్కండేయుడవై

పరుగులు తియ్ బిర బిర బిర బిర

ఉరకలు వెయ్..! చర చర చర చర



కత్తుక కోసె కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడువై

ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్

మట్టిలొకి తన గిట్టలతో నిను తొక్కెయ్యాలని తరుముకు వచ్చె

కాలాశ్వం పై స్వారీ చెయ్..



ఎడారి దారుల తడారిపోయిన ఆశకు చెమటల ధారను పొయ్..!

నిస్సత్తువతో నిలబడ నివ్వక ఒక్కో అడుగును ముందుకు వెయ్..!

వంద ఏళ్ళ నీ నిండు జీవితం గండి పడదనే నమ్మకమై

శతకోటి సమస్యలనెదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసానివై..

పరుగులు తియ్ బిర బిర బిర బిర

ఉరకలు వెయ్..! చర చర చర చర
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment