Monday, July 6, 2020

Maro Charithra » Vidhi Cheyu Vinthalanni మరో చరిత్ర » విధి చేయు వింతలన్నీ

July 06, 2020 Posted by Publisher , , No comments


Song » Vidhi Cheyu Vinthalanni / విధి చేయు వింతలన్నీ

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ Actress : Saritha / సరిత Music Director : M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Vani Jayaram / వాణి జయరాం  Song Category : Club & Item Songs
vidhi cEyu viMtalannI matilEni cEtalEnani
virahaana vEgipOyi vilapiMcE kathalu ennO
vidhi cEyu viMtalannI matilEni cEtalEnani
virahaana vEgipOyi vilapiMcE kathalu ennO
vilapiMcE kathalu ennO



eduru cUpulu edanu piMDagaa ELLu gaDipenu shakuMtala
viraha baadanu maraci pOvagaa nidura pOyenu urmiLa
anuraagamE nijamani manasokaTi daani RujuvanI
tudi jayamu prEmadEnani bali ayinavi bratukulennO
vidhi cEyu viMtalannI



valaci gelici kalalu paMDina jaMTa lEdI ilalO
kulamu matamO dhanamu balamO goMtu kOsenu tudilO
adi nEDu jaruga raadani eDabaasi vEcinaamu
mana gaadhE yuvataraalaku kaavaali marO caritra
kaavaali marO caritra
 
 
Click here to hear the song
విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో
విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో
విలపించే కథలు ఎన్నో



ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాదను మరచి పోవగా నిదుర పోయెను ఉర్మిళ
అనురాగమే నిజమని మనసొకటి దాని ఋజువనీ
తుది జయము ప్రేమదేనని బలి అయినవి బ్రతుకులెన్నో
విధి చేయు వింతలన్నీ



వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో
కులము మతమో ధనము బలమో గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగ రాదని ఎడబాసి వేచినాము
మన గాధే యువతరాలకు కావాలి మరో చరిత్ర
కావాలి మరో చరిత్ర
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment