Tuesday, July 28, 2020

Manoharam » Pucha puvvula      మనోహరం » పుచ్చా పువ్వుల

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Pucha puvvula / పుచ్చా పువ్వుల

Song Details:Actor : Jagapathi Babu / జగపతి బాబు ,Actress : Laya / లయ ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chitra / చిత్ర  ,  Parthasarathi / పార్థసారధి ,Song Category : Love & Romantic Songs
pucchaa puvvula viccE taavula veccaa vennelalu
paccaa mIgaDalIccE tiyyana teccE nI kalalu
vaccE naayamma viccE naayamma
vaccE naayamma kaluvalu viccE naayamma
muddaa baMtulu muni gOriMtalu musirE saMjellO
pottE erugani muddE taragani rasanaariMjallO
vaccE naayamma viccE naayamma
vaccE naayamma kaluvalu viccE naayamma



guvva jaMTalaku kuva kuva iTu kurra guMDelaku melukuva
vINa nITi selayEru cali vENuvUdE cirugaali
kaluva kanulalOna kalavariMtalaayE
caluva tanuvulOna jaladhariMtalaayE
O..O..O..O



veMDi vennela vaMDi vaalcina veMDi isukallO
tellaa mabbulu vellaa vEsina pilla kaaluvallO
vaccE naayamma vaccE naayamma
vaccE naayamma alajaDaloccE naayamma



lEta paccikala anukuva nunu lEta maccikala toNakavaa
niMDu allikala navanava taladiMDu mallikala shiva shiva
paTTapagaTi eMDa paMDu vennelaayE
niTTaniluvu tapanE niluvanIyadaaye
O..O..O..O



pUraa vaakili tIsE tiyyani dOra vayasullO
maaGaa maasapu maMcu bebbuli poMcE vELallO
vaccE naayamma viccE naayamma
vaccE naayamma valapulu viccE naayamma
pucchaa puvvula viccE taavula veccaa vennelalu
paccaa mIgaDalIccE tiyyana teccE nI kalalu
vaccE naayamma viccE naayamma
vaccE naayamma kaluvalu viccE naayamma



 


Click here to hear the song
పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు
పచ్చా మీగడలీచ్చే తియ్యన తెచ్చే నీ కలలు
వచ్చే నాయమ్మ విచ్చే నాయమ్మ
వచ్చే నాయమ్మ కలువలు విచ్చే నాయమ్మ
ముద్దా బంతులు ముని గోరింతలు ముసిరే సంజెల్లో
పొత్తే ఎరుగని ముద్దే తరగని రసనారింజల్లో
వచ్చే నాయమ్మ విచ్చే నాయమ్మ
వచ్చే నాయమ్మ కలువలు విచ్చే నాయమ్మ



గువ్వ జంటలకు కువ కువ ఇటు కుర్ర గుండెలకు మెలుకువ
వీణ నీటి సెలయేరు చలి వేణువూదే చిరుగాలి
కలువ కనులలోన కలవరింతలాయే
చలువ తనువులోన జలధరింతలాయే
ఓ..ఓ..ఓ..ఓ



వెండి వెన్నెల వండి వాల్చిన వెండి ఇసుకల్లో
తెల్లా మబ్బులు వెల్లా వేసిన పిల్ల కాలువల్లో
వచ్చే నాయమ్మ వచ్చే నాయమ్మ
వచ్చే నాయమ్మ అలజడలొచ్చే నాయమ్మ



లేత పచ్చికల అనుకువ నును లేత మచ్చికల తొణకవా
నిండు అల్లికల నవనవ తలదిండు మల్లికల శివ శివ
పట్టపగటి ఎండ పండు వెన్నెలాయే
నిట్టనిలువు తపనే నిలువనీయదాయె
ఓ..ఓ..ఓ..ఓ



పూరా వాకిలి తీసే తియ్యని దోర వయసుల్లో
మాఘా మాసపు మంచు బెబ్బులి పొంచే వేళల్లో
వచ్చే నాయమ్మ విచ్చే నాయమ్మ
వచ్చే నాయమ్మ వలపులు విచ్చే నాయమ్మ
పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు
పచ్చా మీగడలీచ్చే తియ్యన తెచ్చే నీ కలలు
వచ్చే నాయమ్మ విచ్చే నాయమ్మ
వచ్చే నాయమ్మ కలువలు విచ్చే నాయమ్మ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment