Song » Rivvuna saage / రివ్వున సాగే
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jamuna / జమున ,Music Director :
TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
O.................. pallavi : rivvuna sAgE - reparepalADE - yavvanamEmannadi? padE padE savvaDi sEyucunnadi rivvuna caraNaM: pairagAli vOle manasu parugulu peDutunnadi kODetrAcu vOle vayasu kubusaM viDutunnadi 2 sogasainA - biguvainA nAdE nAdE rivvuna caraNaM: nA paruvaM selayErulu naDakalavale vunnavi nA rUpaM virajAjula navvulavale vunnadi 2 jagamaMtA agupiMceda nEnE nEnE rivvuna caraNaM: nIli nIli mabbulanE mElimusugu vEtunA tAralanE dUsi dUsi daMDalugA cEtunA 2 nEnannadi kAlEnidi EdI EdI rivvuna Click here to hear the song
పల్లవి : రివ్వున సాగే - రెపరెపలాడే - యవ్వనమేమన్నది? పదే పదే సవ్వడి సేయుచున్నది రివ్వున చరణం: పైరగాలి వోలె మనసు పరుగులు పెడుతున్నది కోడెత్రాచు వోలె వయసు కుబుసం విడుతున్నది 2 సొగసైనా - బిగువైనా నాదే నాదే రివ్వున చరణం: నా పరువం సెలయేరులు నడకలవలె వున్నవి నా రూపం విరజాజుల నవ్వులవలె వున్నది 2 జగమంతా అగుపించెద నేనే నేనే రివ్వున చరణం: నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా తారలనే దూసి దూసి దండలుగా చేతునా 2 నేనన్నది కాలేనిది ఏదీ ఏదీ రివ్వున ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment