Friday, July 17, 2020

Mangalya Balam » Teliyani Anandam      మాంగల్యబలం » తెలియని ఆనందం

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Teliyani Anandam / తెలియని ఆనందం

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi :

teliyani aanaMdaM naalO kaliginadee udayaM

paravaSamai paaDaenaa hRdayaM

teliyani aanaMdaM naalO kaliginadee udayaM

paravaSamai paaDaenaa hRdayaM

charaNaM : 1

kala kala laaDenu vasaMta vanamu

maimaripiMchenu malayaa nilamu

kala kala laaDenu vasaMta vanamu

maimaripiMchenu malayaa nilamu

teeyani oohala ooyala loogi

taelae maanasamu... aemO...

teliyani aanaMdaM naalO kaliginadee udayaM



charaNaM : 2

rOjoo poochae rOjaa poolu

olikiMchinavi navaraagaalu aa...

rOjoo poochae rOjaa poolu

olikiMchinavi navaraagaalu aa...

parichayamaina kOyila paaTae

kurisae anuraagaM... aemO....

teliyani aanaMdaM naalO kaliginadee udayaM



charaNaM : 3

aruNa kiraNamula giligiMtalalO

karagina telimaMchu teralae tarali

aruNa kiraNamula giligiMtalalO

karagina telimaMchu teralae tarali

erugani viMtalu eduTae nilichi

velugae vikasiMchae... aemO...

teliyani aanaMdaM naalO kaliginadee udayaM


 
 
 
Click here to hear the song
పల్లవి :

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

పరవశమై పాడేనా హృదయం

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

పరవశమై పాడేనా హృదయం



చరణం : 1

కల కల లాడెను వసంత వనము

మైమరిపించెను మలయా నిలము

కల కల లాడెను వసంత వనము

మైమరిపించెను మలయా నిలము

తీయని ఊహల ఊయల లూగి

తేలే మానసము... ఏమో...

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం



చరణం : 2

రోజూ పూచే రోజా పూలు

ఒలికించినవి నవరాగాలు ఆ...

రోజూ పూచే రోజా పూలు

ఒలికించినవి నవరాగాలు ఆ...

పరిచయమైన కోయిల పాటే

కురిసే అనురాగం... ఏమో....

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం



చరణం : 3

అరుణ కిరణముల గిలిగింతలలో

కరగిన తెలిమంచు తెరలే తరలి

అరుణ కిరణముల గిలిగింతలలో

కరగిన తెలిమంచు తెరలే తరలి

ఎరుగని వింతలు ఎదుటే నిలిచి

వెలుగే వికసించే... ఏమో...

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment