Song » Naelato neda annadi / నేలతో నీడ అన్నది
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Kanchana / కాంచన ,Music Director :
T.Chalapathi Rao / టి.చలపతి రావు ,Lyrics Writer :
Devulapalli Venkata Krishna Sastry / దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
pallavi : naelatO neeDa annadi nanu taakaraadani pagaTitO raeyi annadi nanu taakaraadani neeru tannu taakaraadani gaDDiparaka annadi naeDu bhartanae taakaraadani oka bhaarya annadi charaNaM : 1 vaelikosalu taakanidae veeNa paaTa paaDaenaa challagaali taakanidae nallamabbu kurisaenaa talli taMDri okarinokaru taakanidae... neevu laevu... naenu laenu... neevu laevu naenu laenu lOkamae laedulae IInaelatOII charaNaM : 2 ravikiraNaM taakanidae navakamalaM virisaenaa madhupaM tanu taakanidae maMdaaraM murisaenaa maenu maenu taakanidae manasu manasu kalavanidae mamata laedu... manishi laeDu... mamata laedu manishi laeDu manugaDayae laedulae IInaelatOII charaNaM : 3 aMTaraanitanamu oMTaritanamu anaadigaa mee jaatiki adae mooladhanamu IIaMTaraanitanamuII ika samabhaavaM samadharmaM sahajeevanamanivaaryaM telusukonuTa mee dharmaM teliyakuMTae mee karmaM IInaelatOII bhaarya annadi Click here to hear the song
పల్లవి : నేలతో నీడ అన్నది నను తాకరాదని పగటితో రేయి అన్నది నను తాకరాదని నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది చరణం : 1 వేలికొసలు తాకనిదే వీణ పాట పాడేనా చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే... నీవు లేవు... నేను లేను... నీవు లేవు నేను లేను లోకమే లేదులే ॥నేలతో॥ చరణం : 2 రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా మధుపం తను తాకనిదే మందారం మురిసేనా మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే మమత లేదు... మనిషి లేడు... మమత లేదు మనిషి లేడు మనుగడయే లేదులే ॥నేలతో॥ చరణం : 3 అంటరానితనము ఒంటరితనము అనాదిగా మీ జాతికి అదే మూలధనము ॥అంటరానితనము॥ ఇక సమభావం సమధర్మం సహజీవనమనివార్యం తెలుసుకొనుట మీ ధర్మం తెలియకుంటే మీ కర్మం ॥నేలతో॥ భార్య అన్నది ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment