Saturday, July 11, 2020

Manchi Manasulu(ANR) » Entha Takkari vaadu      మంచి మనసులు(ఏయన్నార్) » ఎంతా టక్కరి వాడు

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Entha Takkari vaadu / ఎంతా టక్కరి వాడు
Song Details:Actor :Actress :Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Jamuna raani / జమునా రాణి ,Song Category : Love & Romantic Songs
enthaa  Takkarivaadu  -naa  raju  ae  mulano  nakki  naadu  
vantachenu  gattu  meeda-vantiga  ne  pothunte 
venta  vachhinattulunnadi-evaro  venaka  nilichinattulunnadi 
gubulu  gubuluga  -  gunde  jhallumani 
bikku  bikkumani  chusaanu  -  phakkuna  pakkani  navvenu  evaru?...  naneeda!  ||enta|| 
porliparu  eti  lona  -  buTuku  buTuku  munugutunte 
bugga  taakinattulunnadi  -evaro  paiTa  laginattulunnadi 
giligintalu  pettinatlu  -  vodalanta  pulakarinche 
neellanthaa  vedikinaanu  -trulli  trulli  paripoyenoo  evaru?...  chepa!  ||enta||   
artharaatri  vela  nenu  -aadamarachi  nidurapothe 
vadda  cherinattulunnadi  -evaro  muddulaaDinattulunnadi 
chikkinaadoo  dongayanukoni  cheyi  chaachi  pattabote 
kanti  kemi  kanaraaka  -karigi  karigi  poyenu  yevaru?...kala!  ||enta||
ఎంతా  టక్కరివాడు  -నా  రాజు  ఏ  మూలనో  నక్కి  నాడు  
వంటచేను  గట్టు  మీద-వంటిగ  నే  పోతుంటే 
వెంట  వచ్చినట్టులున్నది-ఎవరో  వెనక  నిలిచినట్టులున్నది 
గుబులు  గుబులుగా  -  గుండె  ఝల్లుమని 
బిక్కు  బిక్కుమని  చూశాను  -  ఫక్కున  పక్కని  నవ్వేను  ఎవరూ?...  నానీడ!  ||ఎంత|| 
పొర్లిపారు  ఏటి  లోన  -  బుటుకు  బుటుకు  మునుగుతుంటే 
బుగ్గ  తాకినట్టులున్నది  -ఎవరో  పైట  లాగినట్టులున్నది 
గిలిగింతలు  పెట్టినట్లు  -  వొడాలంతా  పులకరించే 
నీళ్ళంతా  వెదికినాను  -త్రుల్లి  త్రుల్లి  పారిపోయేనూ  ఎవరూ?...  చేప!  ||ఎంత||   
అర్థరాత్రి  వేళ  నేను  -ఆదమరచి  నిదురపోతే 
వద్ద  చేరినట్టులున్నది  -ఎవరో  ముద్దులాడినట్టులున్నది 
చిక్కినాడూ  దొంగయనుకొని  చేయి  చాచి  పట్టబోతే 
కంటి  కేమి  కానరాక  -కరిగి  కరిగి  పోయేను  ఎవరూ?...కల!  ||ఎంత||

0 comments:

Post a Comment