Monday, July 20, 2020

Manasu Mata Vinadhu » Nuvvu Nijam      మనసు మాట వినదు » నువ్వు నిజం

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Nuvvu Nijam / నువ్వు నిజం
Song Details:Actor : Navdeep / నవదీప్ ,Actress : Ankitha / అంకిత ,Music Director : Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ) ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Kalyani Malik (Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి) ,  Sunitha / సునీత ,Song Category : Love & Romantic Songs
nuvvu nijaM nI navvu nijaM
naa kaMTi kaaMti naDugu
vErE venneluMdi anadu
unnaa daanni vennelanadu
nEnu nijaM naa prEma nijaM
idi picci tanaM anaku
annaa manasu maaTa vinadu
vinnaa avunu kaadu anadu
nIlO naa saMtakaM ceripE vIllEdugaa
naalO nI j~jaapakaM karigE kala kaadugaa
nuvvu nEnU reMDakSharaalugaa maaraaligaa prEmai ilaaga
prEmE ayinaa ika paina kottagaa mana pErugaa pilipiMcukOgaa



evvarikI vinipiMcavugaa mana iddari saMgatulu 
viMTE koMTe aShTapadulu veMTE paDava aShTa dishalu
evvarikI kanipiMcavugaa mana muddula muccaTalu
cUstE jaMTalEni edalu manakE tagulutuMdi usuru
cebitE vinavE elaa egasE niTTUrpulO 
calitO aNicEdelaa ragilE cirugaalulu



nuvvu nEnU reMDakSharaalugaa maaraaligaa prEmai ilaaga
prEmE ayinaa ika paina kottagaa mana pErugaa pilipiMcukOgaa



eppaTikI nanu tappukunE vIlivvani kaugiLulu
cuTTU cilipi celimi ceralu kaTTaa cUDu valapu valalu
duppaTilaa nanu kappinavE nalanallani nI kurulu
iTTaa maayadaari kalalu cUstE mElukOvu kanulu
manasE dOstE elaa
kanakE I saMkela
oDilO paDitE ilaa aDugE kadilEdelaa



nuvvu nEnU reMDakSharaalugaa maaraaligaa prEmai ilaaga
prEmE ayinaa ika paina kottagaa mana pErugaa pilipiMcukOgaa
నువ్వు నిజం నీ నవ్వు నిజం
నా కంటి కాంతి నడుగు
వేరే వెన్నెలుంది అనదు
ఉన్నా దాన్ని వెన్నెలనదు
నేను నిజం నా ప్రేమ నిజం
ఇది పిచ్చి తనం అనకు
అన్నా మనసు మాట వినదు
విన్నా అవును కాదు అనదు
నీలో నా సంతకం చెరిపే వీల్లేదుగా
నాలో నీ జ్ఞాపకం కరిగే కల కాదుగా
నువ్వు నేనూ రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగ
ప్రేమే అయినా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోగా



ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులు 
వింటే కొంటె అష్టపదులు వెంటే పడవ అష్ట దిశలు
ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు
చూస్తే జంటలేని ఎదలు మనకే తగులుతుంది ఉసురు
చెబితే వినవే ఎలా ఎగసే నిట్టూర్పులో 
చలితో అణిచేదెలా రగిలే చిరుగాలులు



నువ్వు నేనూ రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగ
ప్రేమే అయినా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోగా



ఎప్పటికీ నను తప్పుకునే వీలివ్వని కౌగిళులు
చుట్టూ చిలిపి చెలిమి చెరలు కట్టా చూడు వలపు వలలు
దుప్పటిలా నను కప్పినవే నలనల్లని నీ కురులు
ఇట్టా మాయదారి కలలు చూస్తే మేలుకోవు కనులు
మనసే దోస్తే ఎలా
కనకే ఈ సంకెల
ఒడిలో పడితే ఇలా అడుగే కదిలేదెలా



నువ్వు నేనూ రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగ
ప్రేమే అయినా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోగా

0 comments:

Post a Comment