Sunday, July 5, 2020

Malliswari » Akasa vedhilo   మల్లీశ్వరి » ఆకాశ వీధిలో

July 05, 2020 Posted by Publisher , No comments
Song » Akasa vedhilo / ఆకాశ వీధిలో
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Bhanumathi / భానుమతి  ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Devulapalli Venkata Krishna Sastry / దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి  ,Singer : Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ  ,  Ghantasala / ఘంటసాల  ,Song Category : Meloncholic Songs

Ame : AkASa vIdhilO hAyigA egirEvu
dESa dESAlanni tirigi cUsEvu....
EDa tAnunnADO bAvA EDa
jADa telisina pOyirAva A...
aMdAla O mEGamAla
A...caMdAla O mEGamAla
ataDu : gagana sImala tElu O mEGamAla
mA^^Uru guDipaina masali vastunnAvA
malli mATEdaina nAtO 
manasu callagA ceppipOvA



A... nIlAla O mEGamAla
A....rAgAla mEGamAla
Ame: mamata lerigina mEGamAla mamata
nA manasu bAvaku ceppi rAvA
ennALLu nAkaLLu
digulutO rEpavalu ennALLu
eduru tennulu cUcenE
bAvakai cediri kAyalu kAcenE
nIlAla O mEGamAla
rAgAla O mEGamAla
ataDu : manasu telisina mEGamAla
maruvalEnani ceppalEvA



mallitO maruvalEnani ceppalEvA
kaLLu teracinagAni
kaLLu mUsina gAni kaLLu
malli rUpe nilicEnE
nA ceMta malli mATE pilicEnE
Ame: jAliguMDela mEGamAla
bAva lEnani bratukajAlA jAli
kuriyu nA kannIru
guMDelO dAcukuni
vAna jalluga kurisipOvA
kannIru AnavAluga bAvamrOla
 
Click here to hear the song
ఆమె : ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగి చూసేవు....
ఏడ తానున్నాడో బావా ఏడ
జాడ తెలిసిన పోయిరావ ఆ...
అందాల ఓ మేఘమాల
ఆ...చందాల ఓ మేఘమాల
అతడు : గగన సీమల తేలు ఓ మేఘమాల
మాఊరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైన నాతో 
మనసు చల్లగా చెప్పిపోవా



ఆ... నీలాల ఓ మేఘమాల
ఆ....రాగాల మేఘమాల
ఆమె: మమత లెరిగిన మేఘమాల మమత
నా మనసు బావకు చెప్పి రావా
ఎన్నాళ్ళు నాకళ్ళు
దిగులుతో రేపవలు ఎన్నాళ్ళు
ఎదురు తెన్నులు చూచెనే
బావకై చెదిరి కాయలు కాచెనే
నీలాల ఓ మేఘమాల
రాగాల ఓ మేఘమాల
అతడు : మనసు తెలిసిన మేఘమాల
మరువలేనని చెప్పలేవా



మల్లితో మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరచినగాని
కళ్ళు మూసిన గాని కళ్ళు
మల్లి రూపె నిలిచేనే
నా చెంత మల్లి మాటే పిలిచేనే
ఆమె: జాలిగుండెల మేఘమాల
బావ లేనని బ్రతుకజాలా జాలి
కురియు నా కన్నీరు
గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసిపోవా
కన్నీరు ఆనవాలుగ బావమ్రోల
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment