Thursday, July 23, 2020

Majnu » Idi Toli ratri...      మజ్ను » ఇది తొలి రాత్రి...

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Idi Toli ratri... / ఇది తొలి రాత్రి...

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Rajani / రజని ,Music Director : Laxmikanth Pyarelal / లక్ష్మికాంత్ ప్యారేలాల్ ,Lyrics Writer : Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    idi toli rAtri... kadalani rAtri

    idi toli rAtri... kadalani rAtri

    nIvu nAku .. nEnu nIku ceppukunna kathala rAtrI

    prEyasI rAvE... UrvaSi rAvE

    prEyasI rAvE... UrvaSi rAvE.. !!idi tolirAtri !!



caraNaM 1:

    vennelamma dIpAnnI ArpamannadI.. mallelamma paradAlu mUyamannadI

    vennelamma dIpAnnI ArpamannadI.. mallelamma paradAlu mUyamannadI

    dhUpamEmO mattugA tirugutunnadI... dIpamEmO viragabaDi navvutunnadI..

    nI rAka koraku talupu.. nI pilupu koraku pAnupu

    pilici...pilici.. vEci..vEci edurucUstunnavI..I...I...I...



    prEyasI rAvE... UrvaSi rAvE

    prEyasI rAvE... UrvaSi rAvE..



caraNaM 2:

    vennalaMtA aDavi pAlu kAnunnadI... mallemanasu nIrukAri vADutunnadI...A..A..A..

    A..A vennalaMtA aDavi pAlu kAnunnadI... mallemanasu nIrukAri vADutunnadi

    anurAgaM gAlIlO dIpamainadI.. mamakAraM manasunE kAlcutunnadI



    nI civari pilupu koraku..I cAvu rAni bratukU

    cUsi cUsi vEci vEci vEgipOtunnadI..A..A..A
పల్లవి:

    ఇది తొలి రాత్రి... కదలని రాత్రి

    ఇది తొలి రాత్రి... కదలని రాత్రి

    నీవు నాకు .. నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ

    ప్రేయసీ రావే... ఊర్వశి రావే

    ప్రేయసీ రావే... ఊర్వశి రావే.. !!ఇది తొలిరాత్రి !!



చరణం 1:

    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ.. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ

    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ.. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ

    ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ... దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ..

    నీ రాక కొరకు తలుపు.. నీ పిలుపు కొరకు పానుపు

    పిలిచి...పిలిచి.. వేచి..వేచి ఎదురుచూస్తున్నవీ..ఈ...ఈ...ఈ...



    ప్రేయసీ రావే... ఊర్వశి రావే

    ప్రేయసీ రావే... ఊర్వశి రావే..



చరణం 2:

    వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ...ఆ..ఆ..ఆ..

    ఆ..ఆ వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నది

    అనురాగం గాలీలో దీపమైనదీ.. మమకారం మనసునే కాల్చుతున్నదీ



    నీ చివరి పిలుపు కొరకు..ఈ చావు రాని బ్రతుకూ

    చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ..ఆ..ఆ..ఆ



    ప్రేయసీ రావే... ఊర్వశి రావే

    ప్రేయసీ రావే... ఊర్వశి రావే.. !! ఇది తొలిరాత్రి !!

0 comments:

Post a Comment