Tuesday, July 21, 2020

Little Soldiers » Oh vendi vennela      లిటిల్ సోల్జర్స్ » ఓ వెండి వెన్నెల

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Oh vendi vennela / ఓ వెండి వెన్నెల

Song Details:Actor : Ramesh Aravind / రమేశ్ అరవింద్ ,Actress : Heera / హీరా ,Music Director : Sri / శ్రీ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : M.M. Sreelekha / ఎం.ఎం. శ్రీలేఖ  ,Song Category : Others
pallavi :

 O O O veMDi vennela

 O O O digiraa ilaa

 amma koMgulO chaMTi paapalaa

 mabbu chaaTunae uMTae elaa

 paDipOtaanani pasi paadaalaki parugae naerpavaa

 madilO daagina madhubhaavaalaki velugae choopavaa

 manasuMTae maargamuMdi teMchukOvae saMkela
 charaNaM : 1

 O O O suprabhaatamaa

 O O O SubhamaMtramaa

 maelukommanae praemageetamaa

 chaerukunna naa tolichaitramaa

 nee svaraalatO naa naraalalO oka gaMgaanadi

 ee kshaNaana nee jata chaeraalani alalautunnadi

 velluvalaa chaerukOnaa vaechiyunna saMdramaa
 charaNaM : 2

 aMta dooramaa svargamannadi

 chiTikelO ilaa manadainadi

 aMdaraanidaa svapnamannadi

 aMdamaina ee nijamainadi

 chiruhaasaaniki maa saMsaaramae chirunaamaa ani

 ee saMtOshamae maa saMtaanamai chiguriMchaalani

 pratirOju paMDugallae saagutOMdi jeevitaM
 
Click here to hear the song
పల్లవి :

 ఓ ఓ ఓ వెండి వెన్నెల

 ఓ ఓ ఓ దిగిరా ఇలా

 అమ్మ కొంగులో చంటి పాపలా

 మబ్బు చాటునే ఉంటే ఎలా

 పడిపోతానని పసి పాదాలకి పరుగే నేర్పవా

 మదిలో దాగిన మధుభావాలకి వెలుగే చూపవా

 మనసుంటే మార్గముంది తెంచుకోవే సంకెల

 చరణం : 1

 ఓ ఓ ఓ సుప్రభాతమా

 ఓ ఓ ఓ శుభమంత్రమా

 మేలుకొమ్మనే ప్రేమగీతమా

 చేరుకున్న నా తొలిచైత్రమా

 నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగానది

 ఈ క్షణాన నీ జత చేరాలని అలలౌతున్నది

 వెల్లువలా చేరుకోనా వేచియున్న సంద్రమా

 చరణం : 2

 అంత దూరమా స్వర్గమన్నది

 చిటికెలో ఇలా మనదైనది

 అందరానిదా స్వప్నమన్నది

 అందమైన ఈ నిజమైనది

 చిరుహాసానికి మా సంసారమే చిరునామా అని

 ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని

 ప్రతిరోజు పండుగల్లే సాగుతోంది జీవితం
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment